Last Updated on January 20, 2019 by VJ
హాయ్! ఇప్పటి వరకు blogger గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈblogger అప్లికేషనులో ఈ ఆర్టికల్ లో కొన్ని విడ్జెట్స్ ఎలా యాడ్ చేయాలి అని తెలుసుకుందాం. బ్లాగ్ టూల్స్ లేదా అప్లికేషన్ లో సైడ్ బార్ అనేది చాలా ప్రాముఖ్యం కలిగి ఉంటాయి. ఈ సైడ్ బార్ లో మనం బ్లాగ్ అనలిటిక్స్, AdSense కోడ్ యాడ్ చేయలన్నా, రీసెంట్ పోస్టులని, ఫీచర్డ్ పోస్టులని (కొన్ని సెలెక్టెడ్ పోస్టులు) ఇలా ఎన్నో ఫీచర్స్ యాడ్ చేయవచ్చు.
ఇప్పటికే మనం గాడ్జెట్స్ ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకొని ఉన్నాం. కానీ ఒక గాడ్జెట్ ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకోలేదు. ఈ ఆర్టికల్ లో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బ్లాగర్ లో లాగిన్ అయ్యి layout ఆప్షన్ లోకి వెళ్ళితే మనకి సైడ్ బార్ ప్లేస్ లో add గాడ్జెట్ అని ఇలా కనిపిస్తుంది.
ఇప్పుడు దాని పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది.
ఆ ఆర్టికల్ లో ముందుగ నేను బ్లాగ్ అనలిటిక్స్ గాడ్జెట్ ని యాడ్ చేస్తున్నా. ఇందులో మనకి 29 గాడ్జెట్స్ ఉంటాయి. మీకు ఏ గాడ్జెట్ కావాలి అంటే దానిని యాడ్ చేసుకోవచ్చు. బ్లాగ్ అనలిటిక్స్ గాడ్జెట్ కోసం క్రిందకి స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది. మీకు బ్లాగ్ స్టాట్స్ అని ఈ విధంగా కనిపిస్తుంది.
ప్రక్కన కనిపించే + గుర్తు పై క్లిక్ చేస్తే మీకు మళ్ళి ఇంకో పేజి ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మీకు ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ విధంగా బ్లాగ్ స్టాట్స్ గాడ్జెట్ కనిపిస్తుంది. స్టైల్ సెలెక్ట్ చేసుకున్న తరువాత save బటన్ పై క్లిక్ చేస్తే మీకు బ్లాగ్ లో ఆ గాడ్జెట్ యాడ్ అవుతుంది.
అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫీచర్డ్ పోస్టులని యాడ్ చేద్దాం. అందు కోసం మళ్ళి add gadget పై క్లిక్ చేస్తే మళ్ళి మీకు గాడ్జెట్స్ విండో ఓపెన్ అయ్యి కనిపిస్తుంది.
Featured Post ఎదురుగా ఉన్న + గుర్తు పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి మన బ్లాగ్ లో ఉన్న అన్ని పోస్టులు కనిపిస్తాయి. మొదటి ఇమేజ్ లో మీకు పోస్ట్ స్నిప్పెట్ అని కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో పోస్ట్ టైటిల్, టెక్స్ట్ స్నిప్పెట్ అంటే బ్లాగ్ పోస్ట్ టెక్స్ట్ ప్రివ్యూ, అదే విధంగా ఇమేజ్ కనిపించాలా వద్దా, అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. కావాలి అంటే దాని ఎదురుగా ఉన్న బాక్స్ పై టిక్ చేస్తే, వస్తుంది, టిక్ తీసివేస్తే కనపడదు. తరువాత మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. మొదట కనిపించే Use the most recently published post అని ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు రీసెంట్ గా పబ్లిష్ చేసెన పోస్ట్ డిఫాల్ట్ గా కనిపిస్తుంది. కానీ మనకి అందుకోసం రీసెంట్ పోస్ట్స్ అని ఇంకో గాడ్జెట్ ఉంది. కాబట్టి మనం రెండవ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. Select the featured post అని క్రింద మీకు ఒక సెలెక్ట్ బాక్స్ కనిపిస్తుంది. అందులో ఉన్నall labels సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్ని బ్లాగ్ పోస్టులు కనిపిస్తాయి. ఇప్పుడు మీకు అక్కడ కనిపించే పోస్టులలో మీరు దేని పై క్లిక్ చేస్తే అవి మీకు ఈ విధంగా కనిపిస్తాయి.
ఈ విధంగా ప్రివ్యూ కనిపిస్తుంది. అంటే ఒక బ్లాగ్ పోస్ట్ మాత్రమే ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయవచ్చు. ఇప్పుడు save చేస్తే మీకు బ్లాగ్ లో ఈ ఫీచర్డ్ పోస్ట్ అని సైడ్ బార్ లో కనిపిస్తుంది.
ఈ విధంగా మనం సైడ్ బార్ లో విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ లో మనం కాంటాక్ట్ పేజి ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మీకు మా బ్లాగర్ ఆర్టికల్స్ పై ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
Latest posts by VJ (see all)
- 2021 Top Female Bloggers in Telugu - March 8, 2021
- How to Find Blog Post Ideas for Blogging in Telugu - March 3, 2021
- How to Write Blog Posts in Telugu in 2021 - February 24, 2021