Last Updated on January 24, 2019 by VJ
హాయ్! మనం ఇంతకూ ముందు ఆర్టికల్ లో గూగుల్ సెర్చ్ కన్సోల్ లో మన బ్లాగ్ ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాం. ఈ ఆర్టికల్ లో ఒక sitemap ఎలా క్రియేట్ చేయాలి? sitemap గూగుల్ కి ఎలా సబ్మిట్ చేయాలి అని తెలుసుకుందాం. ఈ విధంగా మనం sitemap చేయటం ద్వారా మన బ్లాగ్ లో మనం క్రియేట్ చేసే పోస్టులు ఆటోమేటిక్ గా ఇండెక్స్ అవుతుంది. sitemap క్రియేట్ చేయాలి అంటే ఇదేదో టెక్నికల్ అని అనుకోకండి. చాలా ఈజీగా sitemap జనరేటర్స్ ద్వారా క్రియేట్ చేయవచ్చు.
ముందుగా గూగుల్ ఓపెన్ చేసి sitemap for blogger అని సెర్చ్ చేయండి.
సెర్చ్ చేసిన తరువాత ఈ విధంగా మనకి కొన్ని సెర్చ్ రిజల్ట్స్ కనిపిస్తాయి.
ఇప్పుడు మీకు మొదట కనిపించే ctrlq.org వెబ్ సైట్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ కనిపించే బాక్స్ లో మీ బ్లాగ్ యుఆర్ఎల్ మొత్తాన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. http:// లతో సహా కాపీ చేయండి (టైప్ చేయకండి).
ఈ విధంగా పేస్ట్ చేసిన తరువాత Generate Sitemap పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రిజల్ట్ కనిపిస్తుంది.
మీకు కనిపించే మొత్తాన్ని కాపీ చేసుకుని, దానిని బ్లాగర్ సెట్టింగ్స్ లో search preferences లలో google search console క్రింద ఉన్న custom robots.txt అని కనిపిస్తుంది కదా! డిఫాల్ట్ గా disabled అని ఉంటుంది. దాని ప్రకనే ఉన్న edit పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ మీకు Enable custom robots.txt content? అని ఉంది కదా. అందులో మీకు yes, no అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో డిఫాల్ట్ గా no సెలెక్ట్ చేసి ఉంటుంది. దానిని yes పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
మీరు yes పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక టెక్స్ట్ ఏరియా ఓపెన్ అవుతుంది. అందులో మీరు కాపీ చేసిన కోడ్ ని పేస్ట్ చేయండి.
ఇలా పేస్ట్ చేసిన తరువాత save changes పై క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళి పైన కనిపించే సెర్చ్ కన్సోల్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇంకో ట్యాబు లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
మీకు కనిపించే మీ బ్లాగ్ లింక్ పై క్లిక్ చేస్తే మీకు మీ బ్లాగ్ సెర్చ్ కన్సోల్ ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బార్ లో కనిపించే crawl పై క్లిక్ చేస్తే మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
అందులో మీకు sitemaps అని కనిపిస్తున్న దాని పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు స్క్రీన్ పై ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ మీకు ADD/ TEST SITEMAP పై క్లిక్ చేస్తే మీకు ఒక చిన్న పాపప్ లాంటిది ఓపెన్ అవుతుంది.
పైన కనిపిస్తున్నట్టు, ఒక చిన్న బాక్స్ లో ఇంతకు ముందు మీరు క్రియేట్ చేసిన sitemap ఓపెన్ ని పేస్ట్ చేయాలి (మొత్తం కాదు).
పైన ఇమేజ్ లో చూపించినట్టు, సెలెక్ట్ చేసిన టెక్స్ట్ ని కాపీ చేసి దానిని క్రింద చూపిన విధంగా కనిపిస్తుంది.
పేస్ట్ చేసిన తరువాత ముందుగా టెస్ట్ బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
ఇప్పుడు మీకు టెస్టింగ్ కంప్లేట్ అయ్యాక ఈ విధంగా కనిపిస్తుంది. అక్కడ View test result బటన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ మన బ్లాగ్ లో క్రియేట్ చేసిన 12 పోస్టులు సబ్మిట్ అయ్యాయి అని కనిపిస్తుంది. ఇప్పుడు క్లోజ్ టెస్ట్ పై క్లిక్ చేస్తే మళ్ళి మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
ఇప్పుడు మళ్ళి ADD / TEST SITEMAP పై క్లిక్ చేస్తే ఇంతకూ ముందు చూపించినట్టు వస్తుంది. అందులో మళ్ళి మీరు కాపీ చేసిన యుఆర్ఎల్ కోడ్ పేస్ట్ చేయండి.
ఇప్పుడు submit బటన్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ కంప్లేట్ అయ్యాక ఈ విధంగా కనిపిస్తుంది.
ఇప్పుడు ఒక్కసారి ఆ పేజిని రిఫ్రెష్ చేయండి. మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఈ పోస్టులు ఇండెక్స్ అవ్వటానికి కొంత సమయం తీసుకుంటాయి. ఈ విధంగా మనం మన బ్లాగ్ ని, పోస్టులని గూగుల్ కి సబ్మిట్ చేస్తాం. మనం నెక్స్ట్ ఆర్టికల్ లో గూగుల్ అనలిటిక్స్ ని ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ పై మీకు డౌట్స్ ఏమన్నా ఉంటె కామెంట్ చేయండి.
Latest posts by VJ (see all)
- 2021 Top Female Bloggers in Telugu - March 8, 2021
- How to Find Blog Post Ideas for Blogging in Telugu - March 3, 2021
- How to Write Blog Posts in Telugu in 2021 - February 24, 2021