Last Updated on January 26, 2019 by VJ
హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంత వరకూ ఒక బ్లాగ్ ని క్రియేట్ చేసాం. ఆ బ్లాగ్ ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి సబ్మిట్ చేసాం. ఒక సైట్ మ్యాప్ క్రియేట్ చేసాం, దాన్ని కూడా గూగుల్ కి సబ్మిట్ చేసాం. తరువాత గూగుల్ అనలిటిక్స్ కి మన బ్లాగ్ ని లింక్ చేసాం. మరి మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలో ఈ కోర్సు లో తెలుసుకుంటాం అని. ఓకే , ఒక బ్లాగర్ లో బ్లాగ్ ని క్రియేట్ చేసి, దానికి ఒక కస్టమ్ థీమ్ అప్లై చేసాం, మనం చేయగలిగిన SEO పార్ట్ చేసాం. కానీ నా బ్లాగ్ డొమైన్ నేమ్ ఒక సబ్ డొమైన్ కదా అని మీకు డౌట్ రావచ్చు. అవును, సబ్ డొమైన్ ని మాత్రమే బ్లాగర్ ప్లాట్ఫారం లో గూగుల్ మనకి అందిస్తుంది ఫ్రీగా. ఈ లెసన్ లో మనం ఒక కస్టమ్ డొమైన్ ని ఫ్రీగా ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకుందాం.
అసలు డొమైన్ అంటే ఏంటి? మీకు తెలియదా? నో ప్రాబ్లెమ్, డొమైన్ అంటే ఏంటి, దానిని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని నేను ఒక ఆర్టికల్ వ్రాసాను, దాన్ని చదవండి. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ లెసన్ లో నేను కస్టమ్ డొమైన్ నేమ్ రిజిస్టర్ చేద్దాం అన్నాను కదా ! కస్టమ్ డొమైన్ అంటే .com, .in, org, .net, .co.in, వంటివి రిజిస్టర్ చేసుకోవాలి అంటే మనం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ నేను నా కోర్స్ ఇంట్రడక్షన్ లో మీకు ఒక ప్రామిస్ చేశాను. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను అని. కాబట్టి నేను నా ప్రామిస్ ని నిలబెట్టుకుంటాను. నేను ఈ లెసన్ లో .tk అనే ఎక్స్టెన్షన్ తో ఒక కస్టమ్ డొమైన్ ఎలా ఫ్రీ గా రిజిస్టర్ చేసుకోవాలో వివరంగా స్టెప్ బై స్టెప్ చెప్తాను.
అందుకోసం ముందుగా మీరు గూగుల్ లో freenom అని టైపు చేసి సెర్చ్ చేయండి.
అప్పుడు మీకు ఈ విధంగా కొన్ని సెర్చ్ రిజల్ట్స్ కనిపిస్తాయి.
రిజల్ట్స్ లో మొట్టమొదట కనిపించే www.freenom.comవెబ్సైటు పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు freenom వెబ్సైటు ఇలా ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు మీకు అక్కడ కనిపించే సెర్చ్ బార్ లో మీ బ్లాగ్ కి ఏ డొమైన్ నేమ్ ఉండాలి అని అనుకుంటున్నారో దానిని టైపు చేయండి.
అప్పుడు మీకు ఈ విధంగా ఇంకో పేజీ కనిపిస్తుంది.
ఇందులో మీకు పైన free అని కనిపించే డొమైన్స్ మనకి అవైలబుల్ అని అర్థం. వీటిల్లో నుండి మనం మనకి కావాల్సిన డొమైన్ ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ లెసన్ లో మనకి .tk, .ml, .ga, .cf, .gq అనే ఎక్సటెన్షన్స్ అందుబాటులో ఉన్నాయి. నేను .tk ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక వేళా మీకు .tk కనుక available లో లేకపోతే మీరు మిగిలినవి తీసుకోవచ్చు, లేదా జిమెయిల్ అకౌంట్ లో లాగా వేరే నేమ్ ట్రై చేయవచ్చు. ఇప్పుడు .tk ప్రక్కన ఉన్న Get it now! పై క్లిక్ చేయండి.
అప్పుడు మీకు ఈ విధంగా selected అని గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు పైన గ్రీన్ కలర్ లో కనిపించే checkout బటన్ పైన క్లిక్ చేయండి.
అప్పుడు ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో డిఫాల్ట్ గా మనం సెలెక్ట్ చేసికున్న డొమైన్ 3 months ఫ్రీ అని వస్తుంది. దాని పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
మనకి ఈ డొమైన్ 12 నెలల వరకూ ఫ్రీగా లభిస్తుంది. ఆ తరువాత కావాలంటే మనం కొంత అమౌంట్ ని కట్టాలి. కానీ మనకి అక్కరలేదు. ఎందుకంటె మనం బిగినింగ్ లో మాత్రమే మనం ఈ డొమైన్ ని యూస్ చేస్తాం. తరువాత .com, .in డొమైన్ అమౌంట్ చూసుకుని కొనుకుంటాం. కాబట్టి 12 months అని సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు continue బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ పేజీ కనిపిస్తుంది.
ఇప్పుడు మనం కనిపించే మెయిల్ ఐడీ ఇచ్చి verify my email address బటన్ పై క్లిక్ చేస్తే మనకి ఒక మెయిల్ మనకి వస్తోంది. ఇప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
మన మెయిల్ కి ఈ విధంగా ఇమెయిల్ వస్తుంది.
ఆ మెయిల్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇంకో ట్యాబు ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
అక్కడ మన డీటెయిల్స్ ఇవ్వండి.
డీటెయిల్స్ ఇచ్చిన తరువాత అక్కడ ఉన్న చెక్ బాక్స్ పై క్లిక్ చేసి complete order పై క్లిక్ చేయండి.
దాదాపుగా ప్రాసెస్ కంప్లీట్ అయ్యినట్టే. ఒక కస్టమ్ డొమైన్ ని మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా రిజిస్టర్ చేసుకోగలిగాం. ఇప్పుడు Continue to go to your client area బటన్ పై క్లిక్ చేస్తే మీకు లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.
నేను నా లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అవ్వటానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నాను.
Login బటన్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా మన డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది.
ఈ విధంగా మనం ఒక కస్టమ్ డొమైన్ ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కస్టమ్ డొమైన్ ని మన బ్లాగ్ కి ఎలా లింక్ చేయాలి అనేది తెలుసుకుందాం. మనం బ్లాగర్ ప్లాటుఫార్మ్ ని ఉపయోగిస్తున్నాం అంటే గూగుల్ హోస్టింగ్ ని మన ఉపయోగించుకున్నట్లే. అంతే కదా !
Latest posts by VJ (see all)
- 2021 Top Female Bloggers in Telugu - March 8, 2021
- How to Find Blog Post Ideas for Blogging in Telugu - March 3, 2021
- How to Write Blog Posts in Telugu in 2021 - February 24, 2021