How to Change Blogger Themes in Telugu
హాయ్ ఇంతవరకు మనం బ్లాగ్ లో డిఫాల్ట్ టెంప్లేట్ పై వర్క్ చేస్తున్నాం. ఈ ఆర్టికల్ లో ఒక డిఫాల్ట్ టెంప్లెట్ ని ఎలా మార్చాలి? దాన్ని వల్ల మీ పోస్ట్, పేజి, బ్లాగ్ యొక్క డిస్ప్లే ఎలా ఉండబోతుంది అనే విషయాలు చూద్దాం. ఇందులో నేను ఒక టెంప్లేట్ మార్చి చూపిస్తాను. మిగిలినవి మీరు ఒకసారి చెక్ చేయండి.


How to Change Blogger Themes in Telugu
మనం ఇంతవరకూ ఒక పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక పేజి ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకున్నాం. ఈ రోజు ఒక టెంప్లేట్ ఎలా మార్చాలి అని తెలుసుకుందాం. Blogger లో లాగిన్ అయ్యాక లెఫ్ట్ సైడ్ బార్ లో Theme అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
దాని పై క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది.
ఇక్కడ నేను మీకు బ్లాగర్ లో ఉన్న అన్ని డిఫాల్ట్ థీమ్స్ అన్ని మీకు చూపిస్తున్నాను. నేను ఒకటి లేదా రెండు థీమ్స్ మార్చి చూపటానికి ప్రయత్నిస్తాను. మీరు మీకు నచ్చినవి ట్రై చేయవచ్చు. ఇందులో మీకు మొత్తం 11 టెంప్లేట్స్ ఉన్నాయి. అయితే అందులో మళ్ళి కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఒకసారి ఆ టెంప్లేట్స్ ఏంటో చూద్దాం.
1) Contempo
2) Soho
3) Emporio
4) Notable
5) Simple
6) Dynamic Views
7) Picture Window
8) Awesome Inc.
9) Watermark
10) Ethereal
11) Travel
ఇందులో నేను మీకు Emporio టెంప్లేట్ చేంజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ కనిపించే టెంప్లేట్స్ లో మీరు Emporio అని ఉన్న దాని పై క్లిక్ చేయండి.
ఇలా మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు మీ బ్లాగ్ యొక్క ప్రివ్యూ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీ బ్లాగ్ లో ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది కాబట్టి (ఈ ట్యుటోరియల్స్ ప్రకారం) మీకు ప్రివ్యూలో ఒక్క పోస్ట్ మాత్రమే కనిపిస్తుంది.
చివరలో మీకు Apply to Blog అని ఒక బటన్ కనిపిస్తుంది. దాని పై click చేయండి. అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది.
ఒకసారి view blog పై క్లిక్ చేసి చూడండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఒక వేళ మీకు బ్లాగ్ లో టెంప్లేట్ చేంజ్ అవ్వకపోతే ఒకసారి బ్లాగ్ ని రిఫ్రెష్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే f5 బటన్ పై ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ నేను మొత్తం ఆ పేజిని ఇమేజ్స్ రూపంలో చూపిస్తున్నాను. మీరు స్క్రోల్ చేయగలరు. (అర్థం చేసుకోగలరు అని మనవి).
ఇప్పుడు మీరు బ్లాగ్ పోస్ట్ యొక్క వ్యూ కూడా టెంప్లేట్ బేస్డ్ గా మారిపోతుంటుంది. మీరు ఏదైనా ఒక బ్లాగ్ పోస్ట్ పై క్లిక్ చేస్తే మీకు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
అదే ఒక పేజి వ్యూ కూడా చూడవచ్చు. మీకు ఇంతకూ ముందే ఎలా చూడాలో చెప్పటం జరిగింది. కాబట్టి మీరు పేజి యొక్క వ్యూ చుస్తే ఇలాగ కనిపిస్తుంది.
మీరు నేను చెప్పాలనుకున్నది అర్థం చేసుకోగలరు. (పేజికి, పోస్ట్ కి గల తేడా గురించి). ఈ థీమ్ లో మీకు లెఫ్ట్ సైడ్ బార్ లో పాపులర్ పోస్టులు డిస్ప్లే అవుతాయి.
ఇంకొక టెంప్లేట్ మార్చి చూద్దాం. ఇప్పుడు నేను Notable అనే టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు థీమ్ పై క్లిక్ చేసి మీరు థీమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పైన చెప్పిన విధంగానే టెంప్లెట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ మీకు ఈ టెంప్లేట్ యొక్క ప్రివ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు Apply to Blog అని ఉన్న బటన్ పై క్లిక్ చేయండి.
ఈ విధంగా బ్లాగ్ డిజైన్ మారిపోతుంది. ఒక్కసారి మీరు పోస్ట్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
ఇదే విధంగా పేజి యొక్క వ్యూ కూడా కనిపిస్తుంది.
మీకు ఈ టెంప్లేట్స్ మరింత బాగా అర్థం కావటానికి తరువాతి ఆర్టికల్ లో మీకు కొన్ని ఇమజేస్ లేదా వీడియోస్ ని పోస్టులలో ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. అప్పుడు మీకు మరింత బాగా అర్థం అవుతుంది.
ఈ విధంగా మీరు టెంప్లేట్స్ మార్చుకోవచ్చు. ఈ How to Change blogger themes in Telugu ఆర్టికల్ లో డిఫాల్ట్ గా ఉన్న టెంప్లేట్స్ మాత్రమే వాడటం జరిగింది. తరువాతి ఆర్టికల్స్ లో మీకు ప్రొఫెషనల్ బ్లాగ్ టెంప్లేట్స్ ఎలా బ్లాగ్ కి సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం How to Change blogger themes in Telugu అని ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను.
కాబట్టి మర్చిపోకుండా How to Change blogger themes in Telugu వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
మీకు బ్లాగింగ్ గురించి స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక ఈబూక్ రాశాను. ఆ ఈబూక్ లో ఒక బ్లాగ్ ని స్క్రాచ్ నుండి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పటం జరిగింది. ఒక నిష్ ని ఎలా సెలెక్ట్ చేయాలి? బ్లాగ్స్ ఎలా వ్రాయాలి ఇలా ఎన్నో విషయాలు అందులో చెప్పటం జరిగింది. ఈ ఈబూక్ ప్రైస్ 499/- లకి ఇవ్వడం జరిగింది. మీకోసం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను. మీకు ఇంటరెస్ట్ ఉంటె ఒక్కసారి బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? అనే ఈబూక్ గురించి తెలుసుకోండి.
Latest posts by VJ (see all)
- Blog Monetization in Telugu - January 20, 2021
- How to Grow Your Blog in Telugu - January 16, 2021
- How to Start Blog in Telugu - January 13, 2021