ఫ్రీ గా బ్లాగ్గింగ్ చేయటానికి Blogger ని ఉపయోగించవచ్చు అని ఇంతకూ ముందు ఆర్టికల్స్ లో చెప్పుకున్నాం. ఈ ఆర్టికల్ లో Blogger లో బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి ? అని తెలుసుకుందాం. ఈ Blogger గూగుల్ కి చెందిన ప్రోడక్ట్. Blogger ఉపయోగించడం చాలా ఈజీ. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం !
How to Create A Blog in Blogger in Telugu
How to create a blog in Blogger in Telugu
ముందుగ బ్లాగ్ స్టార్ట్ చేయటానికి Bloggerవెబ్ సైట్ ఓపెన్ చేయండి. ఒక వేల మీకు తెలియకపోతే గూగుల్ ఉంది కదా! వాడేయండి. అప్పుడు మీకు ఈ విధంగా Blogger వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు జిమెయిల్ సైన్ ఇన్ అవ్వమని లాగిన్ పేజి లోకి వెళ్తుంది. ఒకవేళ మీకు జిమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయటం తెలియకపోతే ఇంతకూ నా బ్లాగ్ లో అందుకు సంబంధించిన పోస్ట్ డిటైల్డ్ గా వ్రాయటం జరిగింది.
జిమెయిల్ తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీరు మొట్టమొదటి సారిగా బ్లాగర్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే, మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ కన్ఫాం యువర్ ప్రొఫైల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇది ఎందుకంటె ఇక్కడ బ్లాగర్ ప్రొఫైల్, గూగుల్+ ప్రొఫైల్ అని రెండు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. అయితే ఇందులో గూగుల్+ సెలెక్ట్ చేసుకుంటే మీకు గూగుల్+ ప్రొఫైల్ లో బ్లాగ్ పోస్టులు కూడా షేర్ అవుతాయి. అలా కాకుండా బ్లాగర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే విడిగా బ్లాగర్ ప్రొఫైల్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లాగర్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అప్పుడు మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది.
మీ బ్లాగ్ లో ఆథర్ నేమ్ ఎలా డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటున్నామో ఆ నేమ్ ఇక్కడ కనిపించే డిస్ప్లే నేమ్ అని ఉంది కదా అక్కడ ఇవ్వవచ్చు. నేను ఇక్కడBlogger Vijay అని ఇస్తున్నాను.
ఇలా సెట్ చేసిన తరువాత మన బ్లాగర్ అకౌంట్క్రియేషన్ కి సంబంధించిన ప్రాసెస్ కంప్లేట్ అయ్యినట్లే. ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మీకు స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది.
ఇక్కడ కనిపించే ఇమేజ్ లో టాప్ లెఫ్ట్ లో కనిపించే ఇమేజ్ బ్లాగర్ లోగో. రైట్ సైడ్ బార్ లో ఉన్నవి బ్లాగర్ ఆప్షన్స్. అయితే ఇప్పుడు ఇంకా మనం బ్లాగ్ క్రియేట్ చేయలేదు. జస్ట్ బ్లాగర్ అకౌంట్ క్రియేట్ అయ్యింది.
ఇక ఇప్పుడు బ్లాగ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న CREATE NEW BLOG అని ఉంది కదా, లేదా పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది.
ఇక్కడ కనిపించే TITLE ఫీల్డ్ లో మీ బ్లాగ్ టైటిల్ ని టైపు చేయండి. తరువాత అడ్రస్ అని ఉంది కదా అక్కడ మీ బ్లాగ్ యుఆర్ఎల్ ని ఇవ్వాలి. ఇక్కడ నేను టైటిల్ Test Blogger VJ అని ఇవ్వటం జరిగింది. యుఆర్ఎల్ ని కూడా testblogger.Blogger.com అని ఇవ్వడం జరిగింది.
ఇక్కడ మీకు యుఆర్ఎల్ లో ఇచ్చిన అడ్రస్ అవైలబుల్ లో లేదు అని అడ్రస్ లైన్ కింద మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది. అయితే జిమెయిల్ లో యూసర్ నేమ్లాగే ఇక్కడ కూడా అవైలబుల్ లో లేకపోతే మనకి నచ్చిన అవైలబుల్ లో ఉన్న నేమ్ తీసుకోవచ్చు. అందుకోసం నేను అడ్రస్ లో (అదే యుఆర్ఎల్ లో) testbloggervj.Blogger.com అని చేంజ్ చేశాను. ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది.
ఇక్కడ మీకు This blog address is available అని కనిపిస్తుంది. అంటే ఇక మీ బ్లాగ్ యుఆర్ఎల్ అదే అన్నమాట.
ఇక ఇప్పుడు పై క్లిక్ చేయండి. ఇక మీకు మీ బ్లాగ్ సక్సెస్ ఫుల్ గా క్రియేట్ అయిపోయినట్టే.
తరువాత మీకు ఒక పాప్ అప్ మెసేజ్ ఒకటి కనిపిస్తుంది.
ఇది ఎందుకు అంటే గూగుల్ మన బ్లాగ్ కి ఒక కస్టమ్ డొమైన్ ని సెట్ చేసుకుంటారా? అని అడిగే మెసేజ్. మనం ఇంతకూ ముందే చెప్పుకున్నాం Blogger లో కేవలం సబ్ డొమైన్ మాత్రమే క్రియేట్ చేసుకోగలం. అందుకని మీకు ఈ మెసేజ్ కనిపిస్తుంది. కాబట్టి No Thanks పై క్లిక్ చేయండి. ఇక ఇప్పుడు మీకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.
పైనకనిపించే ఇమేజ్ లో లైట్ కలర్ లో మీకు 3 మెస్సేజ్స్ కనిపిస్తాయి. ఒకటి బ్లాగర్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోండి అని, రెండవది రీసెంట్ గా అన్ని ఇంటర్నెట్ కంపెనీలు GDPR ని అప్డేట్ చేసాయి. వాటిని గురించి వివరంగా చదవటానికి లింక్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. మూడవది కూడా లాంగ్వేజ్ నోటిఫికేషన్ గురించే. కాబట్టి వీటిని మనం లైట్ తీసుకోవచ్చు. మీకు ఆ మెస్సేజ్ పక్కన కనిపించే x మార్క్ పై క్లిక్ చేస్తే అవి క్లోస్ అయిపోతాయి. ఒక్కసారి మీరు క్లోజ్ చేసిన తరువాత మీకు మీ బ్లాగ్ ఈ విధంగా కనిపిస్తుంది.
కాబట్టి ఈ విధంగా Blogger లో ఈ విధంగా ఒక బ్లాగ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ టాపిక్ పై మీకు ఏమన్నా డౌట్స్ ఉంటె మమ్మల్ని సంప్రదించండి. మీ సలహాలని కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.
కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
మీకు బ్లాగింగ్ గురించి స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక ఈబూక్ రాశాను. ఆ ఈబూక్ లో ఒక బ్లాగ్ ని స్క్రాచ్ నుండి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పటం జరిగింది. ఒక నిష్ ని ఎలా సెలెక్ట్ చేయాలి? బ్లాగ్స్ ఎలా వ్రాయాలి ఇలా ఎన్నో విషయాలు అందులో చెప్పటం జరిగింది. ఈ ఈబూక్ ప్రైస్ 499/- లకి ఇవ్వడం జరిగింది. మీకోసం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను. మీకు ఇంటరెస్ట్ ఉంటె ఒక్కసారి బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? అనే ఈబూక్ గురించి తెలుసుకోండి.
తెలుగులో టాప్ 5 ప్రొఫెషనల్ బ్లాగర్స్ లో ఒకరు. గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్ ఇండస్ట్రీలో 8 ఏళ్ళ అనుభవంతో, ఆన్లైన్ ద్వారా మనీ ఎర్నింగ్ చేస్తూ ఎంతో మందికి తన అనుభవ పాఠాలను ఈ బ్లాగ్ ద్వారా ట్యుటోరియల్స్ గా చెప్తున్నారు. తెలుగులో పదివేల మంది బ్లాగర్స్ ని తయారు చేయాలి అని లక్ష్యం గా పెట్టుకున్నారు. అటువంటి వాళ్ళ కోసం తెలుగులో ఎటువంటి టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా వాళ్ళు బ్లాగింగ్ లో సక్సెస్ అవ్వాలి అనుకునేవారి కోసమే ఈ బ్లాగ్ స్టార్ట్ చేశారు.