Site icon Blogger VJ

Lesson #3 | How to Create a Blog Post in Blogger

How to Create a Blog post in Blogger
Sharing is Caring

How to Create a Blog post in Blogger | ఒక బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేయటం ఎలా?

బ్లాగ్గింగ్ చేసేటప్పుడు అత్యంత కీలకమైనది బ్లాగ్ సెట్ చేసుకున్నాక, ఫస్ట్ పోస్ట్ రాయటం. ఇది కొంచెం కష్టం అయిన విషయం. ఒకవేళ మీకు ఫస్ట్ బ్లాగ్ పోస్ట్ ఎలా వ్రాయాలి అని మీకు తెలియకపోతే నా బ్లాగ్ లో ఒక ఆర్టికల్ వ్రాయటం జరిగింది. ఒకసారి దానిని చదవండి. ఈ ఆర్టికల్ లో Blogger లో మన ఫస్ట్ పోస్ట్ ఎలా వ్రాయాలి అనేది చూద్దాం.

How to Create a Blog post in Blogger

How to Create a Blog post in Blogger

ముందు మీరు మీ బ్లాగ్ లో లాగిన్ అవ్వండి. డిఫాల్ట్ గా బ్లాగర్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుంది.
మీ యొక్క ఫస్ట్ పోస్ట్ రాయటం కోసం ముందు మీరు ఒక పోస్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత మీకు ఇంకో స్క్రీన్ కనిపిస్తుంది.
మీకు ఒక Visual Composer ఓపెన్ అవుతుంది. పైన మీకు ఇమేజ్ కనిపించినట్టు. ఇక్కడ మనం ఒక ఆర్టికల్ వ్రాస్తున్నాం అంటే అందులో ఏదో కొంత కంటెంట్ మాత్రమే ఉంటుంది అని అనుకోకూడదు. ఒక ఆర్టికల్ లో ఆ ఆర్టికల్ టైటిల్, ఆర్టికల్ లో కొన్ని హెడ్డింగ్స్, పేరాగ్రాఫ్స్, సబ్ హెడ్డింగ్స్ కూడా ఉంటాయి.
కాబట్టి ఈ ఆర్టికల్లో మీకు వాటి గురించి తెలుసుకుందాం. నేను ఒక శాంపిల్ పోస్ట్ వ్రాస్తాను. మీరు ఒర్జినల్ పోస్ట్ వ్రాయండి. పోస్ట్ టైటిల్ అని ఉన్న దగ్గర ఆ ఆర్టికల్ టైటిల్ అక్కడ వ్రాయాలి. అప్పుడు అది మీకు ఇలా కనిపిస్తుంది.
నేను My First Post అని టైటిల్ ఇచ్చాను. మీరు పైన ఉన్న ఇమేజ్ లో చూడగలరు. తరువాత మీకు వైట్ గా కనిపిస్తున్న ఏరియా పై క్లిక్ చేసి అక్కడ మీరు మీ ఆర్టికల్ టైప్ చేయండి.
ఈ విధంగా టైపు చేసిన తరువాత ఇక్కడ మనకి ఈ visual composer లో typography కి సంబంధించిన ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒక్కసారి ఈ పోస్ట్ యొక్క ప్రివ్యూ చూద్దాం. ఇందుకోసం రైట్ సైడ్ బార్ పైన మీకు Publish,Save, Preview, Close అని మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు ప్రివ్యూ పై క్లిక్ చేస్తే ఇంకొక ట్యాబు లో మీకు ఈ పోస్ట్ యొక్క ప్రివ్యూ కనిపిస్తుంది.
ఇక్కడ మీకు క్లియర్ గా ప్రివ్యూ కనిపిస్తుంది. లైవ్ లో మీ పోస్ట్ ఇలాగె కనిపిస్తుంది. ఈ visual composer లో మనకి ఉన్న అదనపు ప్రయోజనం ఏంటి అంటే మీరు MS word లో ఒక ఆర్టికల్ టైప్ చేసి దాన్ని నీట్ గా ఎడిట్ చేసి యష్టిస్ గా మీరు కాపీ పేస్ట్ చేయవచ్చు.

How to Create a Blog post in Blogger ఒక హెడ్డింగ్ క్రియేట్ చేయటం ఎలా?

మీకు visual composer లో టెక్స్ట్ మెనూ లో normal అని ఒక డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు Heading, Sub Heading, Minor Heading, Normal అని ఆప్షన్స్ ఉంటాయి. మీరు హెడ్డింగ్ గా పెట్టాలి అని అనుకున్న టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకొని heading సెలెక్ట్ చేయండి.
మీరు పైన చూపిన విధంగా సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా రిజల్ట్ కనిపిస్తుంది.
ఆ తరివాత మీరు మళ్ళి కంటెంట్ లేదా టెక్స్ట్ టైప్ చేసి ఇప్పుడు ఒక సబ్ హెడ్డింగ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం.
ఇంతకూ ముందు హెడ్డింగ్ ఎలా క్రియేట్ చేసామో అలాగే సబ్ హెడ్డింగ్ కూడా క్రియేట్ చేయవచ్చు. అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది.
ఇలా మీరు ఒక ఆర్టికల్ వ్రాయవచ్చు. మళ్ళి ఒకసారి ప్రివ్యూ చూద్దాం. అప్పుడు మీకు ఈ విధంగా ప్రివ్యూ కనిపిస్తుంది.
ఆటోమేటిక్ గా మీ బ్లాగ్ పోస్ట్ సేవ్ అవుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఒక పోస్ట్ క్రియేట్ చేయవచ్చు. మీ బ్లాగ్ పోస్ట్ కంప్లేట్ అయ్యాక మీరు publish పై క్లిక్ చేయండి. బ్లాగ్ పోస్ట్ పబ్లిష్ అయ్యాక మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ మీరు క్రియేట్ చేసిన పోస్టులు అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు ఒకసారి మీరు బ్లాగ్ ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ మీకు ఈ పేజి లో మీరు క్రియేట్ చేసిన పోస్టులు అన్ని ఒకదాని క్రింద ఒకటి కనిపిస్తాయి. కొంత టెక్స్ట్ మీకు కనిపించి తరువాత మీకు READ MORE అని ఒక లింక్ ఉంటుంది. మీరు దానిపై క్లిక్ చేస్తే మీకు ఆ బ్లాగ్ ఓపెన్ అవుతుంది. ఆ వ్యూ మీకు ఇలా కనిపిస్తుంది.
మీకు ఈ విధంగా కనిపిస్తుంది. జస్ట్ ఇంతే మీ ఫస్ట్ పోస్ట్ పబ్లిష్ చేసినట్లే. ఇక మీ పోస్ట్ ని సోషల్ మీడియా లో షేర్ చేసి వ్యూస్ పెంచుకోండి.
ఈ విధంగా మీరు మీ బ్లాగ్ లో ఆర్టికల్స్ పోస్ట్ చేయవచ్చు. మీకు ఈ టాపిక్ పైన ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా సాల్వ్ చేయటానికి ట్రై చేస్తాను.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.

కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
మీకు బ్లాగింగ్ గురించి స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక ఈబూక్ రాశాను. ఆ ఈబూక్ లో ఒక బ్లాగ్ ని స్క్రాచ్ నుండి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పటం జరిగింది. ఒక నిష్ ని ఎలా సెలెక్ట్ చేయాలి? బ్లాగ్స్ ఎలా వ్రాయాలి ఇలా ఎన్నో విషయాలు అందులో చెప్పటం జరిగింది. ఈ ఈబూక్ ప్రైస్ 499/- లకి ఇవ్వడం జరిగింది. మీకోసం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను. మీకు ఇంటరెస్ట్ ఉంటె ఒక్కసారి బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? అనే ఈబూక్ గురించి తెలుసుకోండి.

Sharing is Caring
Exit mobile version