How to create a menu in blogger in Telugu
హాయ్ ! లాస్ట్ ఆర్టికల్ లో ఒక టెంప్లేట్ ని ఎలా కష్టమైజషన్ చేయలో తెలుసుకున్నాం. మనం అందులో దాదాపుగా అన్ని టెంప్లేట్ ఆప్షన్స్ ఎడిట్ చేయగలం. ఈ ఆర్టికల్ లో సోషల్ మీడియా మెనూ, మేనుబార్ ని ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం.
How to create a menu in blogger in Telugu
పైన మీకు కనిపించే సోషల్ ఐకాన్స్ ని ఎలా ఎడిట్ చేయాలి అంటే మీరు మొదట లెఫ్ట్ సైడ్ బార్ లో మీకు థీమ్ అని ఆప్షన్ ఉంది కదా! దాని పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ కనిపించే Edit HTML అని ఉన్న బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ముందుగా ఆ ఎడిటర్ పై మౌస్ క్లిక్ చేసి ctrl+f ద్వారా ఫైండ్ ఆప్షన్ ఏనాబుల్ అవుతుంది. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్న కర్సర్ లో
<div id=’top-social-profiles’> అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ మీకు సెలెక్ట్ అయ్యి ఉన్న చోట ahref= తరువాత ఉన్న ‘ www.twitter.com/dasaradhilearns’ టెక్స్ట్ దగ్గర మీ యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్స్ యొక్క లింక్స్ యొక్క టెక్స్ట్ ని టైపు చేయండి. ఇక్కడ నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తాను.
ఈ విధంగా చేయవచ్చు.ఇప్పుడు పైన save theme అని ఉన్న బటన్ పై క్లిక్ చేస్తే ఆ టెంప్లేట్ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి బ్లాగ్ రిఫ్రెష్ చేస్తే మీకు ఆ లింక్స్ అప్డేట్ అవుతాయి.
అదే విధంగా మేనుబార్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళి సెర్చ్ బార్ ఓపెన్ చేసి menu అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. మీకు html ట్యాగ్స్ కనుక తెలిస్తే మీకు ఇవి ఎడిట్ చేయటం ఇంకా ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ కనిపించే # ట్యాగ్ ల తరువాత మీకు కావాల్సిన మెనూ టైటిల్ ని ఇవ్వవలసి ఉంటుంది. ముందుగా నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తాను.
ఇక్కడ మనకి కొన్ని మెనూస్ కనిపిస్తున్నాయి కదా. మనకి మెనూస్ , సబ్ మెనూస్ కూడా ఉన్నాయి. వీటిని నేను ఇలా మారుస్తున్నాను. Business అని about us గా, downloads ని సర్వీసెస్ అని, Parent Category అని ఉన్న దానిని Contact us గా మరుస్తునాను. మిగిలినవి రిమూవ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ మేనుస్ ఉంటె మీరు క్రియేట్ చేసుకోవచ్చు.
ముందుగా మనం మెనూస్ మార్చుదాం, తరువాత లింక్స్ అప్డేట్ చేద్దాం. కాబట్టి ముందుగా Business అని ఉంది కదా దాన్ని చేంజ్ చేద్దాం.
మీకు పైన చూపించిన ఇమేజ్ లో నేను సెలెక్ట్ చేసిన పార్ట్ మొత్తం Business మెనూ కి సంబంధించినది. ఇందులో కూడా సబ్ మెనూస్ ఉన్నాయి. ముందుగా Business అని ఉన్న టెక్స్ట్ ని About Us గా మార్చండి.
తరువాత మీకు కనిపిస్తున్న <ul> దగ్గరి నుండి </ul> వరకూ డిలీట్ చేయండి.
అప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు సేవ్ చేసి బ్లాగ్ ఓపెన్ చేయండి. బ్లాగ్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటె రిఫ్రెష్ చేయండి.
ఇక్కడ మీకు Business బదులుగా About Us అని మారిపోయింది కదా. ఇదే విధంగా మనం మిగిలినవి కూడా మార్చుదాం. తరువాత Downloads ని Services గా మార్చుదాం. సర్వీసెస్ ని సబ్ మెనూ గా మర్చుతునాను. అందులో సబ్ మెనూస్ గా Blogging, Web Designing, Digital Marketing అని మారుస్తున్నాను.
ఇక్కడ మీరు Downloads దగ్గర Services అని మార్చండి. తరువాత ఉన్న DVD, Games, Software అని ఉన్న వాటిని వరుసగా Blogging, Web Design, Digital Marketing అని మారుస్తున్నాను.
ఇప్పుడు సేవ్ చేసి, బ్లాగ్ రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ మార్పుని మీరు గమనించగలరు. ఇక్కడ Digital Marketing అని ఉన్న దగ్గర మీకు మళ్ళి ఇంకో సబ్ మెనూ కనిపిస్తుంది. మీకు కావాలంటే దానిని మార్చుకోవచ్చు. అక్కరలేదు అంటే ఈ విధంగా మార్చుకోవచ్చు.
ఇక్కడ సెలెక్ట్ చేసి ఉన్న దానిని మీరు జాగ్రతగా డిలీట్ చేయండి. మళ్ళి టెంప్లేట్ ని సేవ్ చేసి బ్లాగ్ రిఫ్రెష్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
ఈ విధంగానే మిగిలినవి నేను చేంజ్ చేస్తున్నాను. Parent Category ని about us గా మార్చి, మిగిలినవి తిసివేస్తునాను. ఇంతకుముందు మీరు ఎలా అయితే ఎడిటింగ్ చేసారో అదే విధంగా చేయగలరు.
ఈ విధంగా చేంజెస్ చేసి టెంప్లేట్ సేవ్ చేసి, బ్లాగ్ రిఫ్రెష్ చేస్తే ఇక్కడితో ఈ మెనూ టాపిక్ అయిపోతుంది.
ఈ విధంగా మెనూ టైటిల్స్ మార్చవచ్చు. ఇప్పుడు ఆ లింక్స్ ఎలా మార్చాలి లేదా అప్డేట్ చేయాలి అనే విషయం చూద్దాం. ఇంతకుముందు మనం కేవలం మెనూ టైటిల్స్ మాత్రమే మార్చాం, ఇప్పుడు యుఆర్ఎల్స్ అప్డేట్ చేయటానికి మనం చేంజ్ చేసిన టైటిల్ ఎదురుగా # లెటర్ కనిపిస్తుంది. దాని స్థానంలో మనం మన యుఆర్ఎల్స్ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ ఆర్టికల్ లో మనం about us పేజి లింక్, అప్డేట్ చేద్దాం.
అందుకోసం మనం pages ని క్రొత్త ట్యాబు లో ఓపెన్ చేయండి. మీకు ఆల్రెడీ పేజిని ఎలా ఓపెన్ చేయాలో ఇంతకూ ముందు ఆర్టికల్స్ లో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇంతకూ ముందు క్రియేట్ చేసిన About Us పేజిని ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ ఈ పేజి యొక్క యుఆర్ఎల్ ని కాపీ చేసి నేను చూపించే చోట పేస్ట్ చేయండి.
ఇక్కడ సెలెక్ట్ చేసి ఉన్న లైన్ లో # దగ్గర # ని రిమూవ్ చేసి అక్కడ మీరు ఇంతకూ ముందు కాపీ చేసిన యుఆర్ఎల్ ని పేస్ట్ చేయండి.
ఇప్పుడు సేవ్ చేసి, బ్లాగ్ ఓపెన్ చేయండి, లేదా రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు మీరు కనుక About Us పై క్లిక్ చేస్తే మీకు about us పేజి ఓపెన్ అవుతుంది. అదే విధంగా మనం మిగిలిన పేజిలని కూడా యాడ్ చేయవచ్చు.
కాబట్టి ఇది ఈ ఆర్టికల్. ఈ ఆర్టికల్ పై ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం How to create a menu in blogger in Telugu అని ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.
కాబట్టి మర్చిపోకుండా How to create a menu in blogger in Telugu వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
మీకు బ్లాగింగ్ గురించి స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక ఈబూక్ రాశాను. ఆ ఈబూక్ లో ఒక బ్లాగ్ ని స్క్రాచ్ నుండి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పటం జరిగింది. ఒక నిష్ ని ఎలా సెలెక్ట్ చేయాలి? బ్లాగ్స్ ఎలా వ్రాయాలి ఇలా ఎన్నో విషయాలు అందులో చెప్పటం జరిగింది. ఈ ఈబూక్ ప్రైస్ 499/- లకి ఇవ్వడం జరిగింది. మీకోసం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను. మీకు ఇంటరెస్ట్ ఉంటె ఒక్కసారి బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? అనే ఈబూక్ గురించి తెలుసుకోండి.
Latest posts by VJ (see all)
- Blog Monetization in Telugu - January 20, 2021
- How to Grow Your Blog in Telugu - January 16, 2021
- How to Start Blog in Telugu - January 13, 2021