How to Create About Us page in Telugu
హాయ్! మీ బ్లాగ్ లో ఎక్కువ మంది విసిట్ చేసే పేజి ఏంటో తెలుసా? ఏంట్రా బ్లాగ్ లో ఎక్కువ మంది విసిట్ చేసే పోస్ట్ ఏది అని అడగబోయి ఏ పేజి అని అడుగుతున్నాడు అని అనుకుంటున్నారా? కాదు కాదు నేను సీరియస్ గానే అడుగుతున్నా. సరే నేనే చెప్తాను. మీ బ్లాగ్ లోనే కాదు అన్ని బ్లాగులలో దాదాపుగా About Us పేజిని ఎక్కువ మంది చదువుతారు. అవును నేను చెప్పేది నిజం. ఈ ఆర్టికల్ లో నేను blogger లో మీ about us పేజి ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.


How to Create About Us page in Telugu
ముందుగా blogger లో లాగిన్ అవ్వండి. మనం ఇంతకూ ముందు మూడు పోస్టులు పబ్లిష్ చేసాము. ఇప్పుడు మీకు 3 పోస్టులు బ్లాగ్ లో కనిపిస్తాయి. మీకు లెఫ్ట్ సైడ్ బార్ లో Pages అని ఒక ఆప్షన్ ఉంది కదా దాని పై క్లిక్ చేయండి.
అప్పుడు మీకు ఈ క్రింద చూపిన విధంగా కనిపిస్తుంది.
డిఫాల్ట్ గా పోస్టుల స్క్రీన్ ఎలా ఉందొ అలాంటి స్క్రీన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు There are no pages. Create a new page అని మీకు కనిపిస్తుంది కదా. అంటే ఇంత వరకు మీ బ్లాగ్ లో ఎలాంటి పేజిని మీరు క్రియేట్ చేయలేదు. క్రియేట్ న్యూ పేజి పై క్లిక్ చేయవచ్చు. లేదా పైన మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, New Page, Publish, Revert to draft, తరువాత కనిపించే ఐకాన్ డస్ట్ బిన్ ది. ఇందులో New Page పై కూడా క్లిక్ చేయవచ్చు. అప్పుడు మీకు ఒక పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు వచ్చేటట్టు వంటి స్క్రీన్ వస్తుంది. అదే visual composer అండి. (క్రింద చిత్రంలో చూపించినట్టు)
మీరు about us పేజి క్రియేట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. పోస్ట్ అంటే ఏంటి? పేజి అంటే ఏంటి? అని. అవును పేజి వేరు, పోస్ట్ వేరు. పేజి అంటే స్టాటిక్ అన్నమాట అంటే పెర్మినేంట్ గా ఉంటుంది. పోస్ట్ డైనమిక్, అంటే దాని పోసిషన్ మారుతూ ఉంటుంది. ఈ ఆర్టికల్ లో ఇంట వరకే చెప్తున్నాను.దీని పైన డిటైల్డ్ ఆర్టికల్ వ్రాస్తాను. అందులో పూర్తిగా వివరిస్తాను.
పైన చూపించిన ఇమేజ్ లో కనిపించే Page Title దగ్గర ఆ పేజి యొక్క టైటిల్ ని ఇవ్వాలి. ఇది మనం క్రియేట్ చేస్తున్న about us పేజి కాబట్టి ఇక్కడ about us అని టైటిల్ ఇస్తున్నాను.
తరువాత కనిపించే వైట్ ఏరియా లో మనం బాడీ అఫ్ ది కంటెంట్ వ్రాయాలి. ఇక్కడ మనం వ్రాసేది about us గురించి కాబట్టి అందుకోసం రెడీ చేసిన మేటర్ టైపు చేయండి. ఇక్కడ నేను కొంత డమ్మి టెక్స్ట్ ని వ్రాస్తాను.
ఇక్కడ చూపించినట్టు మీరు మీ గురించి వ్రాయవచ్చు. హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ వంటివి కూడా యడ్ చేయవచ్చు.
అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. పోస్టుల లాగానే పేజెస్ కూడా ఆటోమేటిక్ గా సేవ్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చుడండి. ప్రివ్యూ చూడటం కోసం ప్రివ్యూ పై click చేయండి.
మీ about పేజి ఇలా కనిపిస్తుంది. ఇది about us గురించి కాబట్టి నేను ఇక్కడ నా ఇమేజ్ ఒకటి అప్లోడ్ చేయాలనీ అనుకుంటున్నాను. ఒక డమ్మి ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను. మనం ఇంతకు ముందే ఇమేజెస్ ఎలా అప్లోడ్ చేయాలి అని తెలుసుకున్నాం.
నేను ఒక ఇమేజ్ అప్లోడ్ చేసిన తరువాత ఈ విధంగా కనిపిస్తుంది.
ఇప్పుడు నేను ఈ ఇమేజ్ ని డ్రాగ్ చేయడం ద్వారా క్రింది పేరాగ్రాఫ్ ప్రక్కన వచ్చేటట్లు చేస్తాను. అప్పడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇప్పుడు మీరు ప్రివ్యూ చుస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
ఇది డిఫాల్ట్ టెంప్లేట్ కాబట్టి ఇలా ఉంది. అదే మీరు ఒక మంచి టెంప్లేట్ కనుక వాడితే అప్పుడు మీ బ్లాగ్ రూపు రేఖలే మారిపోతాయి. మీరు మీ about పేజి గురించి వ్రాయటం అయ్యాక మీరు పబ్లిష్ పైన క్లిక్ చేస్తే మీ పేజి పబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీరు ఓపెన్ చేస్తే దాదాపుగా మీకు ప్రివ్యూలో కనిపించినట్టే కనిపిస్తుంది. కానీ మీకు ఎక్కడ ఆ పేజి కి సంబంధించిన లింక్ ఏమి కనపడదు. మీరు మీ పేజిస్ లోకి వెళితే క్రింద చూపించినట్టు ఉంటుంది.
ఆ పేజి పై మౌస్ కనుక ఉంచితే మీకు Edit, View, Share, Delete అని ఆప్షన్స్ ఉంటాయి. అందులో view పై క్లిక్ చేస్తే మీకు ఇంకొక ట్యాబు లేదా విండో లో మీకు మీ about us పేజి కనిపిస్తుంది.
కాబట్టి ఈ విధంగా మీరు about us పేజిని క్రియేట్ చేయవచ్చు. About us పేజి మాత్రమే కాదు ఏ పేజిని అయిన ప్రాసెస్ ఇదే. కాబట్టి మీ బ్లాగ్ కి ఏ పేజెస్ అవసరం అని మీరు అనుకుంటున్నారో వాటిని క్రియేట్ చేయండి. ఈ టాపిక్ పై మీకు ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం How to create about us page in telugu అని ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.
కాబట్టి మర్చిపోకుండా How to create about us page in telugu వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
మీకు బ్లాగింగ్ గురించి స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక ఈబూక్ రాశాను. ఆ ఈబూక్ లో ఒక బ్లాగ్ ని స్క్రాచ్ నుండి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పటం జరిగింది. ఒక నిష్ ని ఎలా సెలెక్ట్ చేయాలి? బ్లాగ్స్ ఎలా వ్రాయాలి ఇలా ఎన్నో విషయాలు అందులో చెప్పటం జరిగింది. ఈ ఈబూక్ ప్రైస్ 499/- లకి ఇవ్వడం జరిగింది. మీకోసం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను. మీకు ఇంటరెస్ట్ ఉంటె ఒక్కసారి బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? అనే ఈబూక్ గురించి తెలుసుకోండి.
- How to Grow Your Blog in Telugu - January 16, 2021
- How to Start Blog in Telugu - January 13, 2021
- Blogging Basics in Telugu - January 4, 2021