fbpx

Lesson #12 | How to Create Blogger Menu Links in Telugu

Sharing is Caring

How to Create Blogger Menu Links in Telugu

ఈ బ్లాగ్ పోస్ట్ లో మీరు తెలిసుకునేవి

హాయ్! మనం లాస్ట్ ఆర్టికల్ లో మెనూస్ గురించి తెలుసుకున్నాం. ఎలా ఎడిట్ చేయాలి అని తెలుసుకున్నాం. ఈ ఆర్టికల్ లో మనం ఏ విధంగా పోస్టులని మెనూ గా సెట్ చేయాలి అని చూద్దాం. ఇందుకోసం మనం కొన్ని ఆర్టికల్స్ క్రియేట్ చేయాలి. అయితే మనకి ఆల్రెడీ పోస్టులు ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకున్నాం. అయితే అందులోనే SEO కి సంబంధించిన మరి కొన్ని విషయాలని కూడా తెలుసుకుందాం.

How to create a menu in blogger in TeluguHow to Create Blogger Menu links in Telugu

How to Create Blogger Menu Links in Telugu

ముందుగా blogger లో లాగిన్ అవ్వండి. ఇప్పుడు ఒక ఆర్టికల్ ని క్రియేట్ చేస్తున్నాను. అందుకోసం New Post బటన్ పై క్లిక్ చేస్తే మనకి visual composer ఓపెన్ అవుతుంది.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
మీకు పైన కనిపించే ఇమేజ్ లో నేను పోస్ట్ యొక్క టైటిల్, తరువాత కొంత టెక్స్ట్ ని అందులో ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ రైట్ సైడ్ బార్ లో మీకు Labels అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని పై క్లిక్ చేస్తే మనకి ఒక టెక్స్ట్ ఏరియా లాంటి ఒక చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
జనరల్ గా WordPress లో అయితే మనకి category అని ఒక ఆప్షన్ ఉంటుంది. కానీ బ్లాగర్ లో మనకి దాని బదులుగా Label అని ఉంటుంది. ఇందులో మనం ఈ పోస్ట్ ఏ category కి ఎలాట్ చేయాలో ఇక్కడ ఇచ్చే word ని బట్టి డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఎన్ని labels అయిన ఇవ్వవచ్చు. కామాతో (,) వాటిని సపరేట్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఈ పోస్ట్ ని web designing అని డిఫైన్ చేస్తున్నాను.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
మీరు యాడ్ చేయాలి అనుకున్న labels యాడ్ చేసిన తరువాత ఆ బాక్స్ క్రింద Done అని ఒక బటన్ కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేస్తే ఆ labels ఈ పోస్ట్ కి అప్లై అవుతాయి. ఇప్పుడు మీరు పబ్లిష్ చేస్తే మీకు బ్లాగ్ లో ఈ పోస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
ఒక మంచి ఇమేజ్ కూడా ఆర్టికల్ కి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ కి నేను ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను. అప్పుడు నేను ఆ బ్లాగ్ పోస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
ఇప్పుడు ఇక మనం మన పని మొదలు పెడదాం. మీకు Headings tags in HTML అని ఈ పోస్ట్ యొక్క టైటిల్ పైన Home >> web designing అని కనిపిస్తుంది కదా, అందులో web designing పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
పైన ఇమేజ్ లో మీకు యుఆర్ఎల్ సెలెక్ట్ చేసి కనిపిస్తుంది కదా. ఈ యుఆర్ఎల్ లో వెబ్ డిజైనింగ్ అని label చేసిన పోస్టులు అన్ని డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఆ యుఆర్ఎల్ ని కాపీ చేసి theme లో edit html పై క్లిక్ చేయండి.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
సెర్చ్ బార్ ఓపెన్ చేసి అందులో menu-primary అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. లైన్ నెంబర్ 1107 లో మీకు వెబ్ డిజైనింగ్ అని ఒక మెనూ కనుపిస్తుంది. దాని ముందు ఒక # కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్ లో మీరు కాపీ చేసుకున్న యుఆర్ఎల్ ని పేస్ట్ చేయండి.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
పైన చూపిన విధంగా పేస్ట్ చేసిన తరువాత సేవ్ థీమ్ పై క్లిక్ చేసి ఇప్పుడు బ్లాగ్ లోకి వెళ్లి ఆ మెనూ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజి ఓపెన్ అవుతుంది.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
ఇప్పుడు నేను ఇంకా బాగా అర్థం కావటానికి ఇంకొక రెండు పోస్టులని వెబ్ డిజైనింగ్ అనే label తో క్రియేట్ చేస్తున్నా.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
ఇప్పుడు బ్లాగ్ లో మనం అప్డేట్ చేసిన లింక్ ని ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తాయి.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
ఈ విధంగా మనం ప్రత్యేకంగా వీటిని మెనూగా డిఫైన్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన మెనూలో పోస్టులని వచ్చేలా చేసాం.
ఇప్పుడు ఒక క్రొత్త మెనూని క్రియేట్ చేద్దాం. ఇందుకోసం నేను Photoshop అనే మెనూని క్రియాట్ చేస్తాను. దానిని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో పోస్టులని ఎలా మెనూగా చేయాలి అని తెలుసుకుందాం. ఇప్పుడు మళ్ళి HTML editor ని ఓపెన్ చేయండి. మనం ఇందాక చెప్పుకున్నట్టు లైన్ నెంబర్ 1107 దగ్గరికి రండి.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
ఇక్కడ సెలెక్ట్ చేసి ఉన్న ఏరియా అంతా కూడా మెనూ కి సంబంధించిన కోడింగ్. ఇందులో contact మెనూ కి ముందు నేను ఫోటోషాప్ మెనూ యాడ్ చేయాలి అని అనుకుంటున్నా. అందు కోసం నేను ఈ క్రింది కోడ్ ని పేస్ట్ చేస్తున్నా.
 <li><a href=’#’>Photoshop</a></li>
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
ఈ విధంగా యాడ్ చేసిన తరువాత, టెంప్లేట్ ని సేవ్ చేసి, బ్లాగ్ ని ఒక్కసారి రిఫ్రెష్ చేస్తే మెనూ అప్డేట్ అయ్యి ఈ విధంగా ఉంటుంది.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
ఇప్పుడు నేను Photoshop label తో కొన్ని పోస్టులని క్రియేట్ చేస్తున్నాను.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
ఇప్పుడు ఒక్కసారి మనం బ్లాగ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
ఇప్పుడు మనకి ఆ పోస్టల పైన Photoshop అని ఒక లింక్ కనిపిస్తుంది కదా. దాని పై క్లిక్ చేస్తే మీకు ఒక పేజి ఓపెన్ అవుతుంది.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
ఇక్కడ కనిపించే యుఆర్ఎల్ ని కాపీ చేసుకుని, ఇంతకూ ముందు మనం క్రియేట్ చేసిన photoshop మెనూ లో క్రియేట్ చేసిన # ని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న యుఆర్ఎల్ పేస్ట్ చేయండి.
How to create a Menu for Posts in Blogger | Blogger VJ
ఇప్పుడు టెంప్లెట్ ని సేవ్ చేసి, బ్లాగ్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఫోటోషాప్ మెనూ పై క్లిక్ చేస్తే మీకు మీరు ఫోటోషాప్ label తో క్రియేట్ చేసిన పోస్టులు అన్ని డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా మనంపోస్టులని మెనూలుగా క్రియేట్ చేయవచ్చు. ఇలా చయడం వలన మన బ్లాగ్ లో కొన్ని పోస్టులని వేరుగా సెట్ చేయవచ్చు.
కాబట్టి మా ఆర్టికల్స్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ Facebook, whatsapp లలో షేర్ చేసి మాకు మరింత ప్రోత్సాహం ఇవ్వండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
కాబట్టి ఇది ఈ ఆర్టికల్. ఈ ఆర్టికల్ పై ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం How to create blogger menu links in Telugu అని ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.

కాబట్టి మర్చిపోకుండా How to create blogger menu links in Telugu వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
మీకు బ్లాగింగ్ గురించి స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక ఈబూక్ రాశాను. ఆ ఈబూక్ లో ఒక బ్లాగ్ ని స్క్రాచ్ నుండి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పటం జరిగింది. ఒక నిష్ ని ఎలా సెలెక్ట్ చేయాలి? బ్లాగ్స్ ఎలా వ్రాయాలి ఇలా ఎన్నో విషయాలు అందులో చెప్పటం జరిగింది. ఈ ఈబూక్ ప్రైస్ 499/- లకి ఇవ్వడం జరిగింది. మీకోసం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను. మీకు ఇంటరెస్ట్ ఉంటె ఒక్కసారి బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? అనే ఈబూక్ గురించి తెలుసుకోండి.
Lesson #12 | How to Create Blogger Menu Links in Telugu 1

Sharing is Caring

Leave a Comment