fbpx

Lesson #9 | How to Customize Blogger Theme in Telugu

Sharing is Caring

How to Customize Blogger Theme in Telugu

హాయ్ మనం ఇంతకు ముందు ఒక కస్టమ్ టెంప్లేట్ ని బ్లాగ్ కి ఎలా అప్లై చేయటం తెలుసుకున్నాం. అయితే కేవలం టెంప్లేట్ అప్లోడ్ చేయటంతో మన పని అయిపోలేదు. ఇంకా కొన్ని కష్టమైజషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఆర్టికల్ లో ఎలా కష్టమైజషన్ చేయాలో తెలుసుకుందాం. దాదాపుగా అన్ని blogger లో టెంప్లేట్స్ కష్టమైజేషన్ ఒకేలా ఉంటుంది.

How to Customize Blogger Theme in Telugu
How to Customize Blogger Theme in Telugu

How to Customize Blogger Theme in Telugu

మరి కష్టమైజషన్ ఎలా చేయాలి? మీకు ఎలా చేయాలో తెలియదు కదా? మరి ఎలా? సాదారణంగా మనుషులకి ఒక క్రొత్త పని మొదటి నుండి ఎలా చేయాలో తెలియదు అని అంటూ ఉంటారు. అప్పుడు మనం కాపీ చేస్తే సరిపోతుంది కదా. నేర్చుకోవటం కూడా అదే కదా. అవును ఇది ఇలా చేయాలి అని మనకి నేర్పించేవాళ్ళు కూడా చూసి నేర్చుకోవాలి అని చెప్తారు కదా.
కాబట్టి నేను ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన టెంప్లేట్ ని ఎలా ఎడిట్ చేయాలో చెప్తునాను. అందుకోసం నేను ఆ టెంప్లేట్ ప్రివ్యూ ని ఓపెన్ చేసి, దానిని చూసి మన బ్లాగ్ ని కష్టమైజషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగ నేను ఆ టెంప్లేట్ కి సంబంధించిన పేజిని ఓపెన్ చేశాను. అందుకు సంబంధించిన లింక్ ని ఇక్కడ ఇస్తున్నాను. Neko దీని పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 1
ఇప్పుడు మీ బ్లాగ్ ఓపెన్ చేయండి. మీ బ్లాగ్ ఇలా కనిపిస్తుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 2
Blogger లో లాగిన్ అయిన తరువాత లెఫ్ట్ సైడ్ బార్ లో కనిపించే Layout అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 3
మనం ఇంత వరకూ డిఫాల్ట్ గా ఉన్న టెంప్లేట్స్ ని ఉపయోగించాం. అందులో ఉండే కొన్ని విడ్జెట్స్ కూడా ఇందులో ఉండిపోతాయి. వాటిని ముందుగ రిమూవ్ చేయండి. నేను మీకు ఒకటి ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. మీరు మిగిలినవి అన్ని రిమూవ్ చేయండి.
ముందుగా నేను మన బ్లాగ్ లో కనిపిస్తున్న Report Abuse అని ఉన్న ఆప్షన్ ని రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటె ఈ విడ్జెట్ మనం డౌన్లోడ్ చేసుకున్న టెంప్లేట్ లో లేదు కాబట్టి దీనిని నేను రిమూవ్ చేస్తున్నాను.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 4
మీ బ్లాగర్ లో layout లో ఈ విధంగా కనిపిస్తుంది. పైన ఇమేజ్ లో మీకు కనిపిస్తున్న Report Abuse అని ఉన్న విడ్జెట్ లో edit అని ఒక బటన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 5
ఇక్కడ మీకు 3 బటన్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 6వీటిల్లో Remove బటన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంకొక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 7
OK పై క్లిక్ చేస్తే ఆ పాపప్ క్లోస్ అవుతుంది. విడ్జెట్ కూడా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీరు బ్లాగ్ రిఫ్రెష్ చేస్తే మీకు ఆ విడ్జెట్ కనిపించదు.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 8
ఇదే విధంగా నేను ఇంకొన్ని విడ్జెట్స్ కూడా రిమూవ్ చేస్తున్నాను. Search This Blog, Blog Archive, About Me, Adsence Blog Archive, Attribution, Follow by Email, Featured Post విడ్జెట్స్ రిమూవ్ చేస్తాను. అప్పుడు మీకు లేఔట్ ఇలా కనిపిస్తుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 9
ఇపుడు ఒకసారి బ్లాగ్ రిఫ్రెష్ చేస్తే మీకు ఈ విధంగా మీకు కనిపిస్తుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 10
ఇప్పుడు లోగో చేంజ్ చేయండి. మనం ఇంతకూ ముందు లోగో ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నాం. కాబట్టి మీరు లోగో చేంజ్ చేయండి. ప్రతీది నేను చెప్పటం వల్ల ఈ ఆర్టికల్ చాలా పెద్దది అవుతుంది అర్థం చేసుకోగలరు. మీరు లోగో చేంజ్ చేసిన తరువాత మీకు బ్లాగ్ లో ఇలా కనిపిస్తుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 11
దాదాపుగా మనం ఈ టెంప్లేట్ ని చేంజ్ చేసినట్లే. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన బ్లాగ్ పేజిలు యాడ్ చేద్దాం. ఇందుకోసం ఆల్రెడీ ఒక విడ్జెట్ ఉంది. దానిని జస్ట్ ఎడిట్ చేద్దాం. layout ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 12
కొంచెం క్రిందకి స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 13
ఇందులో మీకు పేజెస్ పై ఎడిట్ బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 14
ఈ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ మన బ్లాగ్ లో ఎన్ని పేజెస్ క్రియేట్ చేస్తే అన్ని పేజీలు కనిపిస్తాయి. ఇక్కడ ఏ పేజీలు డిస్ప్లే అవ్వాలి అని మనం అనుకుంటామో అవి మాత్రమే కనిపించేలా చేయవచ్చు. ఏ పేజి డిస్ప్లే కావాలి అను అనుకుంటామో దానిని సెలెక్ట్ చేసుకోవాలి. దాని ఎదురుగా ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి save బటన్ పై క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 15
అప్పుడు మన బ్లాగ్ లో ఈ విధంగా కనిపిస్తుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 16
తరువాత ఫూటర్ ని చేంజ్ చేయటం ఎలాగో చూద్దాం. ఇందు కోసం మళ్ళి Theme ఆప్షన్ పై క్లిక్ చేసి Edit HTML బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా మీకు కనిపిస్తుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 17
పైన కనిపించినట్టు సెర్చ్ బార్ లో ఈ విధంగా footer-container అని టైప్ చేయండి. టైప్ చేసాక ఎంటర్ చేయండి. ఈ టెంప్లేట్ లో 2640 వ లైన్ లో మీకు ఈ విధంగా సెలెక్ట్ అయ్యి కనిపిస్తుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 18
ఇక్కడ కనిపించే ఫూటర్ ని చేంజ్ చేయవచ్చు. అయితే కొన్నిసార్లు టెంప్లేట్ క్రియేటర్స్ నుండి అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేసి ఉన్న దానిని చేంజ్ చేస్తే సరిపోతుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 19
ఇక్కడ మనకి 2 ఫూటర్స్ కనపడుతూ ఉన్నాయి. నిజానికి మనకి ఒక ఫూటర్ సరిపోతుంది. ఒకవేళ మీకు కూడా ఈ విధంగా రెండు కావాలి అనుకుంటే మీరు కూడా రెంటిని మోడిఫై చేయవచ్చు. ముందుగా పైన కనిపించే Powered by Blogger అని ఉంది కదా దానిని మోడిఫై చేద్దాం. నిజానికి మనకి ఇక్కడ ఉన్న Powered by Blogger అని ఉన్నది అక్కరలేదు. కాబట్టి ఆ లైన్ ని తీసి వేద్దాం.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 20
సెలెక్ట్ చేసిన భాగాన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసాక save theme పై క్లిక్ చేసి ఒక్కసారి బ్లాగ్ ఓపెన్ చేసి చుడండి.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 21
మీకు బ్లాగ్ లో ఫూటర్ చేంజ్ అవ్వకపోతే ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 22
ఇప్పుడు రెండవ ఫూటర్ ని ఎడిట్ చేద్దాం. నేను దీనిని మోడిఫై చేశాను కదా అందుకని ఈ టెంప్లేట్ కి Design by Blogger VJ అని మార్చుతాను.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 23
ఇక్కడ నేను బాగా అర్థం అవ్వటానికి ఆ కోడ్ ని ఇక్కడ పేస్ట్ చెస్తునాను.

Distributed By Gooyaabi Templates | Blogger Theme By NewBloggerThemes

పైన ఉన్న కోడ్ లో Distributed By అని ఉన్న చోట Designed by అని అదే విధంగా లింక్ దగ్గర నా బ్లాగ్ లింక్ ఇవ్వాలి, ఆ తరువాత ఉన్న Gooyaabi Templates దగ్గర Blogger VJ అని మారుస్తాను. ఒక్కసారి నేను పైన ఉన్న కోడ్ ని మార్చి ఇక్కడ ఇస్తున్నాను. దానిని సెలెక్ట్ చేసి ఉన్న చోట మార్చండి.

Designed By Blogger VJ

Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 24
ఇక్కడ ఈ టెంప్లేట్ వాళ్లు ఆల్రెడీ ఒక మెసేజ్ ఇక్కడ కామెంట్ రూపంలో ఇచ్చారు. మనం ఈ లైన్ ఎడిట్ చేయటానికి మనకి పర్మిషన్ లేదు. ఎందుకంటే మనం ఈ టెంప్లేట్ ని ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకున్నాం. ఒకవేళ ఈ టెంప్లేట్ కొనుకుంటే మీకు ఆ పర్మిషన్ లబిస్తుంది.
మార్చిన తరువాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 25
ఈ విధంగా మనం మనకి కావాల్సినట్టుగా టెంప్లేట్ ని మోడిఫై చేసుకోవచ్చు. తరువాతి ఆర్టికల్లో సోషల్ మీడియా ఐకాన్స్, మేనుబార్ ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం. ఈ టాపిక్ పై మీకు డౌట్స్ యామన్న ఉంటె కామెంట్ చేయండి.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం How to customize blogger theme in Telugu అని ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.

కాబట్టి మర్చిపోకుండా How to customize blogger theme in Telugu వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
మీకు బ్లాగింగ్ గురించి స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక ఈబూక్ రాశాను. ఆ ఈబూక్ లో ఒక బ్లాగ్ ని స్క్రాచ్ నుండి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పటం జరిగింది. ఒక నిష్ ని ఎలా సెలెక్ట్ చేయాలి? బ్లాగ్స్ ఎలా వ్రాయాలి ఇలా ఎన్నో విషయాలు అందులో చెప్పటం జరిగింది. ఈ ఈబూక్ ప్రైస్ 499/- లకి ఇవ్వడం జరిగింది. మీకోసం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను. మీకు ఇంటరెస్ట్ ఉంటె ఒక్కసారి బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? అనే ఈబూక్ గురించి తెలుసుకోండి.
Lesson #9 | How to Customize Blogger Theme in Telugu 26

Sharing is Caring

Leave a Comment

error: Content is protected !!