Site icon Blogger VJ

Lesson #7 | How to Download Custom Themes For Blogger in Telugu

how to download custom themes for blogger

how to download custom themes for blogger

Sharing is Caring

How to Download Custom Themes for Blogger

ఈ బ్లాగ్ పోస్ట్ లో మీరు తెలిసుకునేవి

హాయ్! ఇప్పటి వరకూ మీరు ఒక బ్లాగ్ (Bloggerలో) ఎలా క్రియేట్ చేయాలి? పోస్టులు, పేజీలు ఎలా క్రియేట్ చేయాలి? ఇమేజెస్, వీడియోలు ఎలా ఇన్సర్ట్ చేయాలి ? అనేటు వంటి విషయాలు నేర్చుకున్నారు. అదే విధంగా డిఫాల్ట్ గా టెంప్లేట్స్ ఎలా మార్చాలో కూడా తెలుసుకున్నాం. కానీ Blogger డిఫాల్ట్ టెంప్లేట్స్ అంత ఎట్రాక్టివ్ గా ఉండవు. మరి ఎలా? అందుకే ఈ ఆర్టికల్ లో కస్టమ్ టెంప్లేట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఆ టెంప్లెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం.

how to download custom themes for blogger

How to Download Custom Themes for Blogger

ఇప్పటికే మీకు blogger అప్లికేషను పై ఒక అవగాహనా వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి అందులో free blogger templates అని సెర్చ్ చేయండి.
మీకు ఈ విధంగా కొన్ని సెర్చ్ రిజల్ట్స్ కనిపిస్తాయి.
ఇందులో మీకు మొదట కనిపించే వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయండి. నాకు తెలిసినంత వరకూ బ్లాగర్ టెంప్లేట్స్ లో
Gooyaabi Templates, Sora Templates టెంప్లేట్స్ బాగుంటాయి. మీరు ఆ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే అందులో చాలా ఫ్రీ టెంప్లేట్స్ మీకు కనిపిస్తాయి.
 
ఇక్కడ మీకు కనిపించే టెంప్లెట్స్ నేను ఈ ఆర్టికల్ వ్రాసే సమయానికి లేటెస్ట్ టెంప్లెట్స్. ఒక వేళ మీరు చదివేటప్పటికి ఇంకా లేటెస్ట్ టెంప్లేట్స్ ఉండవచ్చు. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోండి.
ఇక్కడ నేను ఒక టెంప్లేట్ ఎలా ప్రివ్యూ చూడాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. దాదాపుగా అన్ని టెంప్లేట్స్ కి ఒకే ప్రాసెస్ ఉంటుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇవి అన్ని బ్లాగర్ టెంప్లేట్స్. మీకు ఇందులో వెబ్ సైట్ టెంప్లేట్స్ ఉండవు. కాబట్టి గమనించగలరు. ఇక్కడ కనిపించే వాటిల్లో నేను Neko అనే టెంప్లేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను.
మీరు మౌస్ మీకు కావాల్సిన టెంప్లేట్ పై మౌస్ పెడితే ఈ విధంగా కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే, మీకు ఇంకొక పేజి ఓపెన్ అవుతుంది.
మీకు ఈ విధంగా ఆ టెంప్లేట్ కి సంబంధించిన ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. ఈ పేజిలో మీకు టెంప్లేట్ ప్రివ్యూ కింద 3 ఆప్షన్స్ ఇలా కనిపిస్తాయి.
ముందుగా Live Preview పై క్లిక్ చేస్తే ఆ టెంప్లేట్ కి సంబంధించిన ప్రివ్యూ, మన బ్లాగ్ కి ఆ టెంప్లేట్ అప్లై చేస్తే మన బ్లాగ్ ఎలా ఉంటుందో చూడవచ్చు. అంతే కాకుండా అనవసరంగా డౌన్లోడ్ చేసి దానిని బ్లాగ్ కి అప్లై చేసి మనకి నచ్చక లేదా అది బాగోలేకపోతే చాలా టైం వేస్ట్ అవుతుంది.  కాబట్టి Live Preview పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. Live preview పై క్లిక్ చేయగానే ఆ టెంప్లేట్ ప్రివ్యూ ఇంకొక టాబ్ లేదా విండో లో ఓపెన్ అవుతుంది.
ఈ విధంగా మీకు ప్రివ్యూ కనిపిస్తుంది. అయితే మీకు ఒక ఫ్రేమ్ లో మీకు ప్రివ్యూ కనిపిస్తుంది. దానిని తీసివేయటానికి మీరు బాగా క్రిందకి స్క్రోల్ చేస్తే క్రింద మీకు ఇలా కనిపిస్తుంది.
మీకు రైట్ సైడ్ లో Remove Frame to Full Site Preview పై click చేయండి. అప్పుడు మీకు పూర్తిగా ఆ టెంప్లెట్ బ్లాగ్ లాగా కనిపిస్తుంది. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఈ టెంప్లేట్ బాగుంది. ఇక డౌన్లోడ్ చేసుకోవటానికి మీరు ఇంతకూ ముందు ఆల్రెడీ ఓపెన్ చేసిన ట్యాబులో డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు ఆ టెంప్లేట్ డౌన్లోడ్ అవుతుంది.
ఈ విధంగా టెంప్లేట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టెంప్లేట్ ని ఎలా బ్లాగ్ కి ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఈ టాపిక్ పై మీకు ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.

కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
మీకు బ్లాగింగ్ గురించి స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక ఈబూక్ రాశాను. ఆ ఈబూక్ లో ఒక బ్లాగ్ ని స్క్రాచ్ నుండి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పటం జరిగింది. ఒక నిష్ ని ఎలా సెలెక్ట్ చేయాలి? బ్లాగ్స్ ఎలా వ్రాయాలి ఇలా ఎన్నో విషయాలు అందులో చెప్పటం జరిగింది. ఈ ఈబూక్ ప్రైస్ 499/- లకి ఇవ్వడం జరిగింది. మీకోసం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను. మీకు ఇంటరెస్ట్ ఉంటె ఒక్కసారి బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? అనే ఈబూక్ గురించి తెలుసుకోండి.

Sharing is Caring
Exit mobile version