How to insert images videos and YouTube videos in blog post
ఈ బ్లాగ్ పోస్ట్ లో మీరు తెలిసుకునేవి
హాయ్! ఇంతకూ ముందు ఆర్టికల్ లో మీరు ఒక బ్లాగ్ పోస్ట్ ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పటం జరిగింది. ఈ ఆర్టికల్లో ఒక పోస్ట్ లో మీరు ఇమజేస్, వీడియోలు, YouTube వీడియోస్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ ని కొంచెం ముందుగా వ్రాయటానికి కారణం, మీకు మరింతగా అర్థం అవుతుంది అని మేము ఆశిస్తున్నాము.
How to insert images videos and YouTube videos in blog post
How to insert images videos and YouTube videos in blog post
How to Insert Images | ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి?
మనం ఇప్పటికి 4 పోస్టులు క్రియేట్ చేయటం జరిగింది (ఈ ట్యుటోరియల్స్ లో). అందులో నేను మొదటి పోస్ట్ ని ఓపెన్ చేసి అందులో ఇమేజ్ యాడ్ చేయటం చూపిస్తాను. ముందుగా పోస్టులలో ఉన్న మౌస్ పెడితే మీకు ఇలా కనిపిస్తుంది.
ఇప్పుడు మీరు edit పై క్లిక్ చేస్తే, మీకు ఆ పోస్ట్ visual composer ఓపెన్ అవుతుంది.
ఇక్కడ నేను హెడ్డింగ్ పైన ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అక్కడ కర్సర్ పెట్టి, మీకు పైన కనిపించే ఆప్షన్స్ లో, Link అని ఒక ఆప్షన్ అని కనిపిస్తుంది. దాని పక్కనే ఒక ఇమేజ్ సింబల్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే ఒక పాపప్ లాంటిది ఓపెన్ అవుతుంది.
ఇక్కడ ఈ స్క్రీన్ లో మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అప్లోడ్ అని ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి (డిఫాల్ట్ గా అప్లోడ్ సెలెక్ట్ అయిన్ ఉంటుంది). దాని క్రిందపై క్లిక్ చేస్తే మీకు ఫైల్ సెలెక్టర్ ఓపెన్ అవుతుంది.
మీరు అప్లోడ్ చేయాలి అనుకున్న ఇమేజస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పై క్లిక్ చేయండి.
అప్పుడు మీకు ఈ విధంగా ఇమేజ్ అప్లోడ్ అవుతుంది.
ఇమేజ్ అప్లోడ్ అయ్యాక ప్రివ్యూతో మీకు ఇలా కనిపిస్తుంది.
పై క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మీకు ఆ visual composer లో మీరు కర్సర్ పెట్టిన చోట ఇన్సర్ట్ అవుతుంది.
ఇప్పుడు మీరు ఆ ఇమేజ్ యొక్క సైజు కూడా మీరు మార్చుకోవచ్చు. 5 రకాల సైజులు బ్లాగర్ అప్లికేషను అందిస్తుంది. Small, Medium, Large, XLarge, Orginal Size అని మీకు కనిపిస్తాయి. కాబట్టి మీరు కావాల్సిన సైజు సెట్ చేసుకోండి. నేను లార్జ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను (నేను అప్లోడ్ చేసిన ఇమేజ్ సైజు width 1000 pixels, height 500 pixels). ఇప్పుడు అప్డేట్ పై క్లిక్ చేస్తే మీకు ఆ పోస్ట్ అప్డేట్ అవుతుంది. అదే విధంగా నేను అన్ని పోస్టులలో ఇమేజస్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి బ్లాగ్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
అదే పోస్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
అదే విధంగా పేజి కూడా కనిపిస్తుంది. మీరు చూస్తున్న టెంప్లేట్ Notable. ఇప్పుడు నేను Emporio టెంప్లేట్ చేంజ్ చేస్తున్నాను. అప్పుడు మీకు ఈ విధంగా బ్లాగ్ కనిపిస్తుంది.
How to Insert Vidoes and YouTube videos in Blog Post వీడియో లేదా యుటుబ్ వీడియోస్ ఎలా యాడ్ చేయటం?
ఒక బ్లాగ్ పోస్ట్ పై ఉన్న ఎడిట్ బటన్ పై క్లిక్ చేసి visual composer ఓపెన్ అవుతుంది. మీకు ఇమేజ్ ఐకాన్ ప్రక్కన వీడియో ఐకాన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలాగ కనిపిస్తుంది.
ఈ పాపప్ లో మీకు 3 ఆప్షన్స్ లో Upload, From YouTube, My YouTube Videos అని ఉన్నాయి. అప్లోడ్ చేయాలి అనుకుంటే అప్లోడ్ క్రింద ఉన్న పై క్లిక్ చేస్తే మీకు మళ్ళి ఫైల్ సెలెక్టర్ కనిపిస్తుంది.
ఈ విధంగా కనిపిస్తుంది. అంటే వీడియో అప్లోడ్ అవుతుంది అని మీకు మెసేజ్ కూడా చూపిస్తుంది. అప్లోడ్ కంప్లీట్ అయ్యాక అప్డేట్ పై క్లిక్ చేస్తే పోస్ట్ వీడియోతో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు బ్లాగ్ లో ఆ పోస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
మీరు అప్లోడ్ చేసిన వీడియో యుటూబ్ లో అప్లోడ్ అవుతుంది. అదే విధంగా యుటూబ్ వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఈ ఆర్టికల్ లో చెప్పినట్టు మీరు రకరకాల ఇమేజస్, వీడియోస్ అప్లోడ్ చేయవచ్చు. అంతే కాకుండా యుటూబ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయవచ్చు. ఈ టాపిక్ పై మీకు డౌట్స్ ఏమన్నా ఉంటె కామెంట్ చేయండి.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం How to insert Images videos and YouTube videos in Blog Post అని ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.
కాబట్టి మర్చిపోకుండా How to insert Images videos and YouTube videos in Blog Post వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
మీకు బ్లాగింగ్ గురించి స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక ఈబూక్ రాశాను. ఆ ఈబూక్ లో ఒక బ్లాగ్ ని స్క్రాచ్ నుండి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పటం జరిగింది. ఒక నిష్ ని ఎలా సెలెక్ట్ చేయాలి? బ్లాగ్స్ ఎలా వ్రాయాలి ఇలా ఎన్నో విషయాలు అందులో చెప్పటం జరిగింది. ఈ ఈబూక్ ప్రైస్ 499/- లకి ఇవ్వడం జరిగింది. మీకోసం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను. మీకు ఇంటరెస్ట్ ఉంటె ఒక్కసారి బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? అనే ఈబూక్ గురించి తెలుసుకోండి.
తెలుగులో టాప్ 5 ప్రొఫెషనల్ బ్లాగర్స్ లో ఒకరు. గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్ ఇండస్ట్రీలో 8 ఏళ్ళ అనుభవంతో, ఆన్లైన్ ద్వారా మనీ ఎర్నింగ్ చేస్తూ ఎంతో మందికి తన అనుభవ పాఠాలను ఈ బ్లాగ్ ద్వారా ట్యుటోరియల్స్ గా చెప్తున్నారు. తెలుగులో పదివేల మంది బ్లాగర్స్ ని తయారు చేయాలి అని లక్ష్యం గా పెట్టుకున్నారు. అటువంటి వాళ్ళ కోసం తెలుగులో ఎటువంటి టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా వాళ్ళు బ్లాగింగ్ లో సక్సెస్ అవ్వాలి అనుకునేవారి కోసమే ఈ బ్లాగ్ స్టార్ట్ చేశారు.