fbpx

Lesson #13 | How to Schedule a Blogger Blog Post in Telugu

Last Updated on

How to Schedule a Blogger Blog Post in Telugu

హాయ్! ఇంత వరకూ మనం టెంప్లేట్స్ ఎలా కష్టమైజషన్ చేయవచ్చు, మెనూస్ ఎలా ఎడిట్ చేయాలి, పోస్టులు ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజస్ వంటివి ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి వంటివి అన్ని తెలుసుకున్నాం. బ్లాగ్ పోస్టులని మెనూగా పెట్టుకోవటం, వంటివి తెలుసుకున్నాం. ఈ ఆర్టికల్ లో పోస్టుల లింక్స్ ఎలా ఎడిట్ చేయాలి, పోస్టులని ఎలా ముందే షెడ్యూల్ చేయాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం.

How to Schedule a Blogger Blog Post in Telugu
How to Schedule a Blogger Blog Post in Telugu

How to Schedule a Blogger Blog Post in Telugu

ముందుగా blogger లో లాగిన్ అయ్యి ఒక క్రొత్త పోస్ట్ ని క్రియేట్ చేయటం కోసం New Post పై క్లిక్ చేస్తే మీకు visual composer ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు ముందుగా పోస్ట్ టైటిల్ ఈ విధంగా ఇవ్వండి.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
ఈ విధంగా నేను ఒక డమ్మి ఆర్టికల్ ని క్రియేట్ చేశాను. ఇందులో మీకు పోస్ట్ టైటిల్, పోస్టులో హెడ్డింగ్స్ కంటెంట్ టైప్ చేసిన తరువాత మీకు రైట్ సైడ్ బార్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని నేను మీకు ఇంతకూ ముందు వివిరించలేదు.  ఈ ఆర్టికల్ లో వాటి గురించి తెలుసుకుందాం.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
పైన ఇమేజ్ లో మీకు Labels, Schedule, Permalink, Location, Options అని కనిపిస్తున్నాయి కదా! మీకు అందులో Labels గురించి లాస్ట్ ఆర్టికల్ లో తెలుసుకున్నాం. ఇప్పుడు permalink గురించి తెలుసుకుందాం. ఇది యుఆర్ఎల్ కి సంబంధించిన టాపిక్. దీని పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
పైన మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో మొదటిది, డిఫాల్ట్ యుఆర్ఎల్. మీరు ఇచ్చిన పోస్ట్ టైటిల్ ని బేస్ చేసుకుని Automatic Permalink క్రియేట్ అవుతుంది. ఇంకొక విషయం permalink అంటే యుఆర్ఎల్ స్ట్రక్చర్. మీకు కనిపించే రెండవ ఆప్షన్, custom permalink. దీనిని మనం ఎడిట్ చేయవచ్చు. ఆటోమేటిక్ పెర్మలింక్స్ లో పోస్ట్ టైటిల్ ని బట్టి క్రియేట్ అవుతుంది అని తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మీరు దాని పై క్లిక్ చేస్తే మీకు ఎడిట్ చేయటానికి కర్సర్ పాయింట్ వస్తుంది.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
మీరు అన్ని పోస్టులకి మార్చాల్సిన అవసరం లేదు. ఏ యుఆర్ఎల్ మీకు కన్వినేంట్ గా లేదో వాటిని మారిస్తే సరిపోతుంది. నేను ఈ ఆర్టికల్ లో మీకు ఆ పేర్మ లింక్ ఎడిట్ చేస్తాను.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
ఇప్పుడు మీరు ఎడిట్ చేసిన తరువాత మీరు యుఆర్ఎల్ స్ట్రక్చర్ కూడా మారిపోతుంది. మీరు పైన చిత్రం లో యుఆర్ఎల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. Done బటన్ పై క్లిక్ చేస్తే మీకు సేవ్ అవుతుంది.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
సేవ్ చేసిన తరువాత permalink దగ్గర ఈ విధంగా కనిపిస్తుంది. కింద ఉన్న లొకేషన్ నిజానికి మనకి అంతగా అవసరం లేదు కాబట్టి నేను దానిని స్కిప్ చేస్తున్నాను. తరువాత మీకు ఆప్షన్స్ అని ఉంది కదా, ఆప్షన్స్ మిద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
ఈ పోస్టుకి రీడర్స్ యొక్క కామెంట్స్ Allow చేయాలా, వద్దా అని, HTML ద్వారా పోస్ట్ ని క్రియేట్ చేయాలా లేదా visual composer ద్వారా క్రియేట్ చేయాలా అని, తరువాత లైన్ ని బ్రేక్ చేయటానికి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇంత వరకూ మీరు నేర్చుకున్న blogger టాపిక్స్ లో మీకు బ్లాగ్గింగ్ గురించి కొంత అవగాహనా వచ్చి ఉండవచ్చు. కాబట్టి ఈ ఆప్షన్స్ మీకు ఈజీగా అర్థం అవుతాయి.
తరువాత కొన్ని పోస్టులని ముందే షెడ్యూల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అసలు షెడ్యూల్ ఎందుకు చేస్తారు అంటే (నా పాయింట్ అఫ్ వ్యూ లో ) నేను ఒకే సారి 10 ఆర్టికల్స్ వ్రాసాను. అయితే నేను వీటిని ఒకేసారి పబ్లిష్ చేయలేను. సరిగ్గా అదే సమయానికి నేను ఒక 4 రోజులు వేరే ఊరు వెళ్ళవలసి వస్తే, అలాంటప్పుడు నాకు ఈ షెడ్యూల్ అనే ఆప్షన్ చక్కగా ఉపయోగపడుతుంది. మీరు అనుకోవచ్చు ఊరు వెళితే షెడ్యూల్ చేసుకోవటం ఎందుకు అని, ప్రయాణం చేసే సమయం లో ఇంటర్నెట్, అంత సమయం ఉండకపోవచ్చు. లేదా నేను వెళ్ళే పని నేను అనుకున్న సమయానికి అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ముందుగానే షెడ్యూల్ చేసి పెట్టుకుంటే నా అబ్సేన్స్ లో కూడా నా బ్లాగ్ రెగ్యులర్ గా కంటిన్యూ అవుతుంది.
ఇప్పుడు blogger లో ఎలా షెడ్యూల్ చేసుకోవాలో చూద్దాం. మనం ఇప్పటికే ఒక బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేసి ఉన్నాం, దాంట్లోనే మనకి ఆప్షన్స్ లో Schedule అని కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
ఇక్కడ మనకి Automatic అని ఉంది కదా, డిఫాల్ట్ గా మనం పబ్లిష్ పై క్లిక్ చేస్తే వెంటనే పబ్లిష్ అవుతుంది. దాని క్రింద మనకి Set Date and time అని ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక క్యాలెండరు కనిపిస్తుంది. అందులో మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఈ ఆర్టికల్ నేను ప్రిపేర్ చేసే సమయానికి డేట్ and టైం సెప్టెంబర్ 10 2018, 21: 26 అయ్యింది. ఇప్పుడు నేను డేట్ కోసం క్యాలెండరు లో క్లిక్ చేస్తే మీకు ఆ డేట్ సెలెక్ట్ అవుతుంది.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
అదే విధంగా టైం సెట్ చేసుకోవటానికి పైన మీకు టైం కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
వచ్చిన డ్రాప్ డౌన్ లో మీరు టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా అక్కడ మీరు టైం టైప్ చేయవచ్చు.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
ఈ విధంగా మనం టైం & డేట్ సెట్ చేసి డన్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు పబ్లిష్ పై క్లిక్ చేస్తే ఆ పోస్ట్ మీరు సెట్ చేసిన డేట్ & టైం కి షెడ్యూల్ చేయబడుతుంది.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
మీరు పైన కనిపించే ఇమేజ్ చూసినట్లయితే మీకు ఆ పోస్ట్ షెడ్యూల్ చేసినట్టు అర్థం అవుతుంది.
ఇప్పుడు ఒక ఇమేజ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. అందుకోసం మనం ఆల్రెడీ షెడ్యూల్ చేసిన పోస్ట్ ని ఎడిట్ పై క్లిక్ చేస్తున్నా. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
ఇప్పుడు మీరు ఇమేజ్ ఐకాన్ పై క్లిక్ చేసి ఒక ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయండి.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
ఇక్కడ మీకు ఇమేజ్ ఇన్సర్ట్ అయ్యింది కదా. మీరు ఇమేజ్ సెలెక్ట్ చేస్తే (లేదా క్లిక్ చేస్తే ) మీకు పైన కనిపించే విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇవి సైజు, ఎలైన్మేంట్, కాప్షన్, ప్రాపర్టీస్, రిమూవ్ అని ఉంటాయి. మనం ఇంతకూ ముందు సైజు గురించి తెలుసుకున్నాం. ఎలైన్మేంట్ అంటే ఆ ఇమేజ్ లెఫ్ట్ లో కావాలో, రైట్ లో కావాలో, సెంటర్లో కావాలో సెట్ చేయటానికి. Add Caption అంటే మీరు ఇన్సర్ట్ చేసిన ఇమేజ్ కి ఒక కాప్షన్ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
ప్రాపర్టీస్ అంటే మనం ఇంతకూ ముందు చెప్పుకున్న alt ట్యాగ్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించినవి. Properties పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ
ఇక్కడ మీకు Title Text అంటే ఆ ఇమేజ్ యొక్క టైటిల్, క్రింద ఉన్న Alt text అంటే మీరు చెప్పాలనుకున్న ఆర్టికల్, లేదా ఆ ఇమేజ్ కీవర్డ్ ని అక్కడ ఇన్సర్ట్ చేస్తాం.
How to Schedule a Blog Post in Blogger in Telugu | Blogger VJ

ఈ విధంగా యాడ్ చేయటం ద్వారా ఆ ఇమేజ్ మన ఆర్టికల్ ర్యాంకింగ్ అవ్వటానికి సహాయ పడుతుంది. 
ఈ ఆర్టికల్ లో మీకు SEO కి సంబంధించిన టిప్స్ కూడా చెప్తాను.

SEO టిప్స్:

1.  మీ ఆర్టికల్ లో కనీసం 300 పదాలు (వర్డ్స్) ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటె గూగుల్ లో ర్యాంకింగ్ అవ్వటానికి మినిమం 300 పదాలు ఉండాలి.
2.  మీ బ్లాగ్ పోస్ట్ టైటిల్ లో మీరు రాస్తున్న ఆర్టికల్ మెయిన్ కీవర్డ్ ని టైటిల్ లో కూడా ఇవ్వండి.
3.  మీ హెడ్డింగ్ లో కూడా ఆ కీవర్డ్ ని ఇన్సర్ట్ చేయండి. అదే విధంగా పేరాగ్రాఫ్స్ లో కూడా కీవర్డ్స్ ని కూడా యాడ్ చేయవచ్చు. అయితే కేవలం కీవర్డ్స్ ని మాత్రమే ఆర్టికల్స్ ఇన్సర్ట్ చేస్తే మీ ఆర్టికల్, మీ బ్లాగ్ ని గూగుల్ స్పాం గా ట్రీట్ చేసే అవకాశం ఉంది.
4.  మీ బ్లాగ్ ఆర్టికల్ లో మరో ఆర్టికల్ ని లైక్ చేయండి దీనిని inbound linking అని అంటారు.
5.  అదే విధంగా మీరు వేరే వెబ్ సైట్ కి సంబంధించిన లింక్స్ ని కూడా ఇవ్వండి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి. ఏ వెబ్ సైట్ పడితే ఆ వెబ్ సైట్ ని లింక్ ఇవ్వకండి. ఎందుకంటె స్ట్రాంగ్ వెబ్ సైట్ అయితే మీకు కూడా ఆ వెబ్ సైట్ నుండి ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉంది.
6.  మీరు అప్లోడ్ చేసిన ఇమజేస్ కి alt ట్యాగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. (అది ఎలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం.)
ఇవి కొన్ని టాప్ బ్లాగ్గింగ్ SEO టిప్స్. వీటిని రెగ్యులర్ గా ఫాలో అయితే మీ బ్లాగ్ సెర్చ్ ఇంజిన్స్ లో ర్యాంకింగ్ అవ్వటానికి అవకాశాలు ఉంటాయి.
ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పోస్ట్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని తెలుసుకున్నాం. కాబట్టి మీరు blogger లో పోస్టులు ఎలా క్రియేట్ చేస్తే ర్యాంకింగ్ అవుతుంది అనే విషయాలు తెలుసుకున్నారు కదా.
కాబట్టి ఇది ఈ ఆర్టికల్. ఈ ఆర్టికల్ పై ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం How to Schedule a blogger blog post in Telugu అని ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.

కాబట్టి మర్చిపోకుండా How to Schedule a blogger blog post in Telugu వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
మీకు బ్లాగింగ్ గురించి స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక ఈబూక్ రాశాను. ఆ ఈబూక్ లో ఒక బ్లాగ్ ని స్క్రాచ్ నుండి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పటం జరిగింది. ఒక నిష్ ని ఎలా సెలెక్ట్ చేయాలి? బ్లాగ్స్ ఎలా వ్రాయాలి ఇలా ఎన్నో విషయాలు అందులో చెప్పటం జరిగింది. ఈ ఈబూక్ ప్రైస్ 499/- లకి ఇవ్వడం జరిగింది. మీకోసం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను. మీకు ఇంటరెస్ట్ ఉంటె ఒక్కసారి బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? అనే ఈబూక్ గురించి తెలుసుకోండి.
ఈ ఆర్టికల్ పై మీకు ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
Lesson #13 | How to Schedule a Blogger Blog Post in Telugu 1

Leave a Comment

Pin It on Pinterest