How to Upload Custom Blogger Themes in Telugu
హాయ్! మనం ఇంతకూ ముందు ఆర్టికల్ లో కస్టమ్ / ప్రొఫెషనల్ టెంప్లేట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఈ ఆర్టికల్లో నేను డౌన్లోడ్ చేసిన టెంప్లేట్ ఎలా మన బ్లాగ్ కి అప్లై చేయాలో తెలుసుకుందాం. మనం ఇప్పటికే డిఫాల్ట్ టెంప్లేట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి కూడా తెలుసుకున్నాం.


How to upload custom blogger themes in Telugu
మనం ఇంతకూ ముందు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లేట్ zip ఫార్మాట్ లో ఉంటుంది. దానిని ముందుగా extract చేయాలి. ఒక వేళ మీకు తెలియకపోతే మమల్ని ఫాలో అవ్వండి.
మీరు మౌస్ రైట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీరు Extract to Neko అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా extract అవుతుంది.
ఇప్పుడు మీరు ఎక్కడ అయితే extract చేస్తే మీకు అక్కడ Niko అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది.
ఇప్పుడు బ్లాగర్ లో లాగిన్ అయ్యిన తరువాత లెఫ్ట్ సైడ్ బార్ లో థీమ్ (theme) అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
పైన కనిపించే ఇమేజ్ లో మీకు రైట్ టాప్ లో Backup / Restore అనే బటన్ కనిపిస్తుంది. ఇప్పుడు దాని పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
ఒక పాపప్ ఓపెన్ అయ్యింది కదా! ఇందులో మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఆల్రెడీ ఉన్న టెంప్లేట్ ని డౌన్లోడ్ చేసుకోవటం కోసం, రెండవది మీ దగ్గర ఉన్న టెంప్లేట్ ని అప్లోడ్ చేయటం కోసం ఉన్నది. ఇందులో మనం డౌన్లోడ్ చేసిన టెంప్లేట్ ని ఉప్లోద్ చేస్తాం. ఇక్కడ మీకు browse అని ఒక బటన్ కనిపిస్తుంది కదా, దాని పై క్లిక్ చేస్తే మీకు ఫైల్ సెలెక్టర్ ఓపెన్ అవుతుంది.
మనం ఇంతకూ ముందే extract చేసుకున్నNiko ఫోల్డర్ ఓపెన్ చేసి అందులో ఉన్నNiko అని ఉన్న XML ఫైల్ ని సెలెక్ట్ చేసి, ఓపెన్ పై క్లిక్ చేయండి.
ఓపెన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ కనిపించే upload బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా టెంప్లేట్ చేంజ్ అయ్యి ఈ విధంగా కనిపిస్తుంది.
ఇప్పుడ ఒకసారి బ్లాగ్ ఓపెన్ చేసి చుస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇప్పుడు మనం కొంచెం దీనీ పై వర్క్ చేయవలసిన అవసరం ఉంది. ఈ విధంగా మనం టెంప్లేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన టెంప్లేట్స్ మన బ్లాగ్ కి అప్లై చేయవచ్చు.
మీకు ఈ టెంప్లేట్ లో ఒక మెయిన్ మెనూబార్, సోషల్ మెనూబార్, సైడ్బార్ లో సెర్చ్ బార్, పోపులర్ పోస్టులు, ఫూటర్ విడ్జెట్స్, ఫూటర్ ఇలా ఎన్నో అదనపు హంగులు బ్లాగ్ కి కనిపిస్తాయి. వీటి గురించి మనం నెక్స్ట్ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఈ టాపిక్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం How to upload custom blogger themes in Telugu అని ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.
కాబట్టి మర్చిపోకుండా How to upload custom blogger themes in Telugu వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
మీకు బ్లాగింగ్ గురించి స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక ఈబూక్ రాశాను. ఆ ఈబూక్ లో ఒక బ్లాగ్ ని స్క్రాచ్ నుండి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పటం జరిగింది. ఒక నిష్ ని ఎలా సెలెక్ట్ చేయాలి? బ్లాగ్స్ ఎలా వ్రాయాలి ఇలా ఎన్నో విషయాలు అందులో చెప్పటం జరిగింది. ఈ ఈబూక్ ప్రైస్ 499/- లకి ఇవ్వడం జరిగింది. మీకోసం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను. మీకు ఇంటరెస్ట్ ఉంటె ఒక్కసారి బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? అనే ఈబూక్ గురించి తెలుసుకోండి.
Latest posts by VJ (see all)
- How to Grow Your Blog in Telugu - January 16, 2021
- How to Start Blog in Telugu - January 13, 2021
- Blogging Basics in Telugu - January 4, 2021