Last Updated on January 29, 2019 by VJ
![]() ![]() |
Website Designing Course | Lesson 02 | How to create HTML Headings and Paragraphs in Telugu |
హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ లెసన్ లో ఒక వెబ్ పేజీ (ఫస్ట్ వెబ్ పేజీ) ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఒక వెబ్ పేజీ ఎలా క్రియేట్ చేయాలి అని మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ లెసన్ లో మనం వెబ్ పేజెస్ లో హెడ్డింగ్స్, పేరాగ్రాఫ్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.
ఇప్పుడు notepad ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు నేను వ్రాసిన కోడింగ్ వ్రాయండి. ముందుగా ఒక html టాగ్ వ్రాయాలి.


ఈ విధంగా మనం ఒక html టాగ్ వ్రాయాలి. ఇలా ఒకేసారి వ్రాయటం నేర్చుకోవటం ఒక మంచి అలవాటు. ఎందుకంటె ఇలా వ్రాయటం వలన ఎక్కడ టాగ్ బ్రేక్ అవ్వటం అనేది జరగదు. టాగ్ బ్రేక్ అవ్వడం వలన మన కోడింగ్ స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది.
ఇప్పుడు దాని మధ్యలో head టాగ్ వ్రాయాలి.


ఇప్పుడు head మధ్యలో title టాగ్ వ్రాయాలి.


ఇప్పుడు ఆ టైటిల్ టాగ్ మధ్యలో మీ వెబ్ పేజీ యొక్క టైటిల్ ని టైపు చేయండి.


ఇక్కడితో మనకి హెడ్ సెక్షన్ కోడ్ వ్రాయటం కంప్లీట్ అయ్యింది (ఈ లెసన్ లో). ఇప్పుడు </head> టాగ్ తరువాత <body> టాగ్ వ్రాయాలి.


ఇప్పుడు మనం ఏం వ్రాయాలి అని అనుకుంటే ఆ <body> అని ఉన్న ఓపెనింగ్ టాగ్ తరువాత వ్రాయాలి. ఇప్పుడు అందులో మీరు ఈ విధంగా కొంత కోడింగ్ వ్రాయండి.


ఇప్పుడు ఈ ఫైల్ ని మనం లాస్ట్ లెసన్ లో సేవ్ చేసుకున్నట్టు సేవ్ చేయాలి. నేను index.html అని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ index.html ఫైల్ ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.


పైన కనిపించే ఇమేజ్ లో మీకు 6 హెడ్డింగ్స్ ఉన్నాయి. HTML లో హెడ్డింగ్స్ 6 రకాలు. అవి h1 నుండి h6 వరకు ఉన్నాయి. ఇవి మీకు వివిధ రకాల సైజులలో కనిపిస్తాయి. ఒక వేళ మీరు h7 అని ఒక కొత్త టాగ్ వ్రాసిన అది పని చేయదు. ఒకసారి ట్రై చేసి చూద్దాం.


ఇక్కడ మీకు h7 టాగ్ తో పాటుగా నేను మీకు తేడా తెలియటానికి పేరాగ్రాఫ్ టాగ్ కూడా వ్రాసాను. ఇప్పుడు సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేయటానికి f5 బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.


అంటే మనకి h7 టాగ్ పని చేయలేదు. ఎందుకంటే h7 టాగ్ ని W3C వాళ్ళు డిఫైన్ చేయలేదు. W3C అంటే World Wide Web Consortium. వెబ్ కి సంబంధించిన అప్డేట్స్ అన్ని World Wide Web Consortium డిఫైన్ చేస్తుంది. వీళ్ళే HTML5, CSS లని డిఫైన్ చేసి వెబ్ టెక్నాలిజీస్ అప్డేట్ చేసారు. ఈ విధంగా మనం హెడ్డింగ్స్ క్రియేట్ చేస్తాం.
పేరాగ్రాఫ్స్ ఎలా యాడ్ చేయాలి?
పేరాగ్రాఫ్స్ యాడ్ చేయటం కోసం మనం <p> టాగ్ ఉపయోగిస్తాం. నేను ఒక పేరాగ్రాఫ్ టాగ్ యాడ్ చేసి అందులో నేను ఒక డమ్మి టెక్స్ట్ యాడ్ చేస్తాను. డమ్మి టెక్స్ట్ యాడ్ చేయటానికి https://www.lipsum.com అనే వెబ్సైటు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మీకు అనేక పేరాగ్రాఫ్స్ కనిపిస్తాయి. అందులో నుండి దేనిని అయినా మీరు కాపీ చేసి, <p></p> తగల మధ్యలో ఈ విధంగా పేస్ట్ చేయండి.


ఇప్పుడు సేవ్ చేసి వెబ్ పేజీని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.


ఇప్పుడు మరిన్ని పేరాగ్రాఫ్స్ యాడ్ చేయటానికి నేను ఇంకొక రెండు సార్లు పేస్ట్ చేస్తున్నాను.


ఈ విధంగా కనిపిస్తున్న ఫైల్ ని మీరు సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి.


ఇప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కానీ మనకి కావాల్సింది ఇలా కాదు. మరి ఎలా ఇన్సర్ట్ చేయాలి ? అందుకోసం మనం ఇంతకూ ముందు వ్రాసిన <p> టాగ్ క్లియర్ చేయండి. మళ్ళి ఒక టాగ్ <p></p>వ్రాయండి. దాని మధ్యలో మీరు ఒకసారి డమ్మి టెక్స్ట్ పేస్ట్ చేయండి. ఇప్పుడు మీకు మళ్ళి ఇంకొక పేరాగ్రాఫ్ వెబ్ పేజీలో కావాలి అంటే ఇంకొక <p></p> టాగ్ వ్రాయాలి. ఈ విధంగా వ్రాయండి.


ఇక్కడ నేను మీకు అర్థం కావటానికి నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఫైల్ సేవ్ చేసి, రిఫ్రెష్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది.


ఇప్పుడు మనం ఈ విధంగా హెడ్డింగ్స్, పేరాగ్రాఫ్స్ క్రియేట్ చేస్తాం. తరువాత లెసన్ లో HTML టెక్స్ట్ ఫార్మట్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
Latest posts by VJ (see all)
- 2021 Top Female Bloggers in Telugu - March 8, 2021
- How to Find Blog Post Ideas for Blogging in Telugu - March 3, 2021
- How to Write Blog Posts in Telugu in 2021 - February 24, 2021