Last Updated on February 1, 2019 by VJ
![]() ![]() |
Website Designing Course | Lesson 05 | How to Create HTML Lists in Telugu | Blogger VJ |
హాయ్ మనం లాస్ట్ లెసన్ లో వెబ్ పేజెస్ లో ఇమేజెస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అని తెలుసుకున్నాం. అలాగే లింక్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఈ లెసన్ లో మనం HTML లో లిస్టులని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.
HTML లో 3 రకాల లిస్టులు ఉంటాయి. అవి:
1. Unordered Lists
2. Ordered Lists
3. Definition Lists
Unordered Listలు వెబ్ పేజెస్ లో బుల్లెట్స్ ఇవ్వడం కోసం, Ordered Lists నంబరింగ్ ఇవ్వడం కోసం, Definitions కోసం Definition Lists ఉపయోగిస్తాం. వీటిని మనం వెబ్ పేజెస్ లో ఎలా ఇన్సర్ట్ చేయాలి అని తెలుసుకుందాం.
Unordered Lists ఎలా క్రియేట్ చేయాలి?
ఈ బ్లాగ్ పోస్ట్ లో మీరు తెలిసుకునేవి
అందుకోసం నేను ఈ విధంగా కోడింగ్ వ్రాస్తున్నాను.


ఇప్పుడు మనం ఒక unordered list కోసం <h1> టాగ్ తరువాత ఈ విధంగా వ్రాయండి.


పైన రాసిన కోడింగ్ లో ul అని ఒక టాగ్ వ్రాసామ్. ఆ టాగ్ లోపల li అని మళ్ళి ఇంకొక టాగ్ వ్రాసాము. మనకి ఎన్ని బులెట్ లిస్ట్ కావాలి అంటే అన్ని li టాగ్స్ వ్రాయాలి. ఇప్పుడు సేవ్ చేసి బ్రౌసర్ లో ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.


పైన కనిపించే ఇమేజ్ లో ఉన్న బులెట్ లిస్ట్ unordered list ద్వారా రాయటం జరిగింది. మనం వెబ్ పేజెస్ లో నావిగేషన్ కోసం అంటే మెనూస్ కోసం కూడా మనం ఈ unordered listలని మాత్రమే వ్రాయాలి.
Ordered Lists ఎలా వ్రాయాలి?
అందుకోసం ఈ విధంగా మనం కొంత కోడింగ్ వ్రాయండి.


ఇప్పుడు ordered లిస్ట్ వ్రాయడం కోసం ఈ విధంగా h1 టాగ్ తరువాత వ్రాయండి.


పైన వ్రాసిన కోడింగ్ లో ol అనే టాగ్ వ్రాయటం జరిగింది. ol అంటే ordered list ని వెబ్ పేజీలో క్రియేట్ చేయటానికి ఉపయోగిస్తాము. తరువాత అందులోనే li టాగ్ వ్రాయటం వలన మనకి నంబరింగ్ వస్తుంది. ఇప్పుడు సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.


మనం li టాగ్స్ లో వ్రాసిన కంటెంట్ మనకి నంబరింగ్ వచ్చి ఉంటాయి. మనకి ఎంత వరకు నంబరింగ్ కావాలి అని అనుకుంటే అన్ని li టాగ్స్ వ్రాయాలి.
Definition List ఎలా వ్రాయాలి?
Definition list లు మనం డెఫినిషన్స్ కోసం, లేదా అబ్రవేషన్స్ కోసం ఉపయోగిస్తారు. వీటిని చాలా తక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు మనం కొంత కోడింగ్ వ్రాద్దాం.


H1 టాగ్ తరువాత ఈ విధంగా డెఫినిషన్ లిస్ట్ టాగ్ కోడింగ్ వ్రాయండి.


పైన వ్రాసిన కోడింగ్ లో మనం మొదట వ్రాసిన dl టాగ్ డెఫినిషన్ టాగ్ ని ఇండికేట్ చేస్తుంది.
తరువాత dl టాగ్ లో వ్రాసిన dt టాగ్ డెఫినిషన్ టర్మ్ ని డిఫైన్ చేస్తుంది.
తరువాత వ్రాసిన dd టాగ్ డెఫినిషన్ డిస్క్రిప్షన్ ని డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.


ఈ విధంగా మనం డెఫినిషన్ లిస్టులని క్రియేట్ చేస్తాం.
సాదారణముగా మనం వెబ్ పేజెస్ లో Unordered Lists,Ordered Lists ఎక్కువగా ఉపయోగిస్తాం. Definition Lists చాలా తక్కువగా ఉపయోగించటం జరుగుతుంది.
ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్. తరువాతి లెసన్ లో మనం స్క్రోలింగ్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
మీకు మంచి కంటెంట్ అందించటం కోసం మేము చాలా ఎఫర్ట్ చేస్తున్నాం. మీ సపోర్ట్ మాకు కొంత బూస్టింగ్ లభిస్తుంది.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
మీకు మంచి కంటెంట్ అందించటం కోసం మేము చాలా ఎఫర్ట్ చేస్తున్నాం. మీ సపోర్ట్ మాకు కొంత బూస్టింగ్ లభిస్తుంది.
Latest posts by VJ (see all)
- 2021 Top Female Bloggers in Telugu - March 8, 2021
- How to Find Blog Post Ideas for Blogging in Telugu - March 3, 2021
- How to Write Blog Posts in Telugu in 2021 - February 24, 2021