Last Updated on February 3, 2019 by VJ
![]() ![]() |
Website Designing Course | Lesson 07 | What is Iframes, Comments in HTML | Blogger VJ |
హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ లెసన్ లో టెక్స్ట్ స్క్రోలింగ్స్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. అదే విధంగా ఇమేజెస్ ని కూడా ఎలా స్క్రోల్ చేయాలో తెలుసుకున్నాం. ఈ లెసన్ లో మనం ఒక వెబ్ పేజీ లో ఇంకొక పేజీ ని ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్ స్టార్ట్ చేద్దాం.
Iframe అంటే ఏంటి?
ఈ బ్లాగ్ పోస్ట్ లో మీరు తెలిసుకునేవి
ఒక వెబ్ పేజీ లో ఇంకొక వెబ్ పేజీని ఇన్సర్ట్ చేయటానికి మనం Iframe అనే టాగ్ ఉపయోగిస్తాం. Iframes ద్వారా మనం వెబ్ పేజెస్, యూట్యూబ్ వీడియోస్ ని ఇన్సర్ట్ చేయగలం. మరి ఒక iframe ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం.
ముందుగా మనం ఈ విధంగా కోడింగ్ వ్రాద్దాం.


పైన కనిపించే కోడ్ వ్రాసిన తరువాత iframe టాగ్ ఈ విధంగా వ్రాయండి.


ఇప్పుడు వెబ్ పేజీ సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు బ్రౌసర్ లో ఈ విధంగా కనిపిస్తుంది.


ఈ విధంగా మనకి మన వెబ్ పేజీ లో Blogger VJ బ్లాగ్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు మనం iframe కి width, height attributes వ్రాద్దాం.


ఈ విధంగా వ్రాసిన తరువాత మీరు సేవ్ చేసి, వెబ్ పేజీని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.


మన వెబ్ పేజీలో 1020 pixels width, 600 pixels height ఉన్న iframe లోపల Blogger VJ బ్లాగ్ ఓపెన్ అవుతుంది. ఒక్కసారి ఈ Iframe కోడింగ్ చూద్దాం.
మనం వ్రాసిన iframe టాగ్ లో src attribute ద్వారా మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్న వెబ్ పేజీ లేదా యూట్యూబ్ వీడియో లింక్ (యుఆర్ఎల్) ఇవ్వాలి.
Iframe డిఫాల్ట్ width అండ్ height లతో ఉంటుంది. మనకి కావాల్సినంత width పెంచాలన్న, తగ్గించాలన్నా width attribute ని ఉపయోగిస్తాం.
అదే విధంగా మనం height అనే attribute ఉపయోగిస్తాం.
ఈ విధంగా మనం iframes ని ఉపయోగిస్తాం.
Comments అంటే ఏంటి?
ఒక వెబ్ పేజీ లో ఉన్న HTML కోడ్ లో మనం నోట్స్ వ్రాయాలి అన్నా, HTML కోడ్ డిలీట్ చేయకుండా వర్క్ చేయకుండా ఉండాలి అన్నా మనం comment టాగ్ ని ఉపయోగిస్తాం. ఈ కామెంట్స్ బ్రౌసర్ లో కనిపించవు. కానీ HTML source code లో మాత్రమే కనిపిస్తుంది.
HTML Comments ఎలా వ్రాయాలి?
<!– ఈ విధంగా మనం కామెంట్స్ ని HTML పేజెస్ లో వ్రాస్తాం –>
పైన కనిపించే టాగ్ లో (!) ఆశ్చర్యార్ధమ్ కామెంట్ ఓపెనింగ్ టాగ్, క్లోసింగ్ మాత్రం –> ఇలా వ్రాస్తే సరిపోతుంది.
ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాం.


ఈ విధంగా నేను కొంత కోడ్ వ్రాసాను. ఇందులో నేను రెండు పేరాగ్రాఫ్స్ వ్రాసాను. మీరు ఈ వెబ్ పేజీ సేవ్ చేసి, ఓపెన్ చేస్తే మీకు వెబ్ బ్రౌసర్ లో ఓపెన్ చేయండి.


అప్పుడు మీకు పై విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ పేరాగ్రాఫ్ కి కామెంట్ వ్రాద్దాం. అందుకోసం నేను కోడింగ్ లో పేరాగ్రాఫ్ ఓపెన్ టాగ్ ముందు <!– ఈ క్యారెక్టర్స్ వ్రాయండి. అదే పేరాగ్రాఫ్ క్లోసింగ్ టాగ్ తరువాత –> ఈ క్యారెక్టర్స్ వ్రాయండి.


ఈ విధంగా మనం వ్రాసిన తరువాత సేవ్ చేసి, ఈ వెబ్ పేజీ ని బ్రౌసర్ లో ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.


మనం ఏ టాగ్ కి అయితే కామెంట్ వ్రాశామో ఆ టాగ్ హైడ్ అవుతుంది. ఆ టాగ్ బ్రౌసర్ లో కనిపించదు. కానీ వెబ్ పేజీ లో ఉంటుంది. అందుకోసం బ్రౌసర్ లో రైట్ బటన్ పై క్లిక్ చేసి view page source పైన క్లిక్ చేయండి.


ఈ విధంగా పేజీ సోర్స్ కోడ్ ఓపెన్ చేస్తే మనకి ఇంకొక ట్యాబు లో ఈ వెబ్ పేజీ యొక్క సోర్స్ కోడ్ ఓపెన్ అవుతుంది.


ఈ విధంగా మనకి ఓపెన్ అయ్యింది కదా! మీకు గ్రీన్ కలర్ లో మీరు కామెంట్ చేసిన కోడ్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం కామెంట్స్ ఉపయోగిస్తాం.
ఈ విధంగా మనం ఒక వెబ్ పేజీలో మరొక వెబ్ పేజీని ఎలా ఇన్సర్ట్ చేయాలో, కామెంట్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
Latest posts by VJ (see all)
- 2021 Top Female Bloggers in Telugu - March 8, 2021
- How to Find Blog Post Ideas for Blogging in Telugu - March 3, 2021
- How to Write Blog Posts in Telugu in 2021 - February 24, 2021